చలికాలంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే ఈ ఆహారాలను తినండి

First Published Dec 15, 2022, 12:03 PM IST

రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకునేటప్పుడు మన ఆరోగ్యం, ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి కొన్ని పోషకాలను తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. 
 

cholesterol

చలికాలంలో అతిగా తింటుంటారు. ఎందుకంటే.. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. దీంతో శరీరం వెచ్చగా ఉండటానికి కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కోరుకుంటుంది. దీంతో రుచికరమైన ఆహారాలను, పానీయాలను తీసుకుంటుంటారు. వీటివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా పెరిగిపోతాయి. అందుకే చలికాలంలో ఏవి పడితే అవి ఎక్కువగా తినకూడదు. మంచి ఆహారం, వ్యాయామం, అప్పుడప్పుడు కొన్ని మందులతో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించువకోచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలు సహాయపడతాయి. చలికాలంలో అతిగా తింటుంటారు. ఎందుకంటే.. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. దీంతో శరీరం వెచ్చగా ఉండటానికి కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కోరుకుంటుంది. దీంతో రుచికరమైన ఆహారాలను, పానీయాలను తీసుకుంటుంటారు. వీటివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా పెరిగిపోతాయి. అందుకే చలికాలంలో ఏవి పడితే అవి ఎక్కువగా తినకూడదు. మంచి ఆహారం, వ్యాయామం, అప్పుడప్పుడు కొన్ని మందులతో అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించువకోచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలు సహాయపడతాయి. 

టిల్ ఆయిల్, ఆవనూనె, ఆలివ్ ఆయిల్ వంటి మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే నూనెలను ఉపయోగించండి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే కూడా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

cholesterol

కరిగే ఫైబర్ అధికంగా ఉండే ఇసాబ్గోల్, ఆకు కూరలు, ఓట్ బ్రాన్, మొత్తం పప్పుధాన్యాలు తినడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయంటున్నారు  ఆరోగ్య నిపుణులు. 

విటమిన్ ఇ సప్లింమెంట్లు కూడా LDL లేదా చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధిస్తాయి. అందుకే ఈ సీజన్ లో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకుంటే విటమిన్ ఇ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.
 

cholesterol

మీ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి మీరు కొన్ని ఆహారాలను ఎక్కువగా తినండి. తక్కువ సంఖ్యలో ఆరోగ్యకరమైన ఆహారాల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  ప్రభావితమవుతాయి.

cholesterol

అయితే కుకీలు, కేకులు, పేస్ట్రీలు ఎక్కువగా వెన్నతో తయారవుతాయి. వీటిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అలా అని వీటిని మొత్తమే తినకుండా ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే బేకింగ్ చేసేటప్పుడు వెన్నకు బదులుగా ఆపిల్ సాస్ లేదా అరటిపండ్లను వాడండి. 

High Cholesterol

ఇతర మాంసం ఉత్పత్తుల కంటే, గొర్రె, మటన్,  పంది మాంసంలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇప్పటికే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. వీటిని తినకపోవడమే మంచిది. ఒకవేళ మీకు గుండె జబ్బులు ఉంటే ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న చేపలు, కాల్చిన లేదా ఉడికించిన చికెన్ వంటి ఆరోగ్యకరమైన  వాటిని తినొచ్చు. 

High Cholesterol

పకోడీలు, ఫ్రైస్, బంగాళాదుంప చిప్స్ వంటి డీప్ ఫ్రైడ్ స్నాక్స్ ను చలికాలంలో ఎక్కువగా తింటుంటారు. కానీ వేయించిన ఆహారాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి మంచి రుచిగా ఉన్నప్పటికీ.. మన   శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. 

click me!