విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఇదేనట...!

First Published | Dec 15, 2022, 11:09 AM IST

విడాకుల కోసం మహిళలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట. వారు అసలు విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. అదేంటో ఓసారి చూద్దాం..

జీవితాంతం కలిసి ఉండాలి అనే కోరికతోనే ఎవరైనా పెళ్లి బంధంలోకి అడుగుపెడతారు. అయితే... ఈ కాలంలో ఎక్కువ మంది పెళ్లికి విలువ ఇవ్వడం లేదు. చిన్న చిన్న విషయాలనే గొడవలు పడి.. వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో విడాకులు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా... విడాకుల కోసం మహిళలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట. వారు అసలు విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారో తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. అదేంటో ఓసారి చూద్దాం..


దేశంలో విడాకులు తీసుకుంటున్న దాదాపు 72శాతం మహిళలు.. తమకు లైంగిక సంతృప్తి లభించడం లేదని చెప్పడం గమనార్హం. తమను తమ భాగస్వామి తృప్తి పరచడం లేదని.. అందుకే  తాము విడాకుల బాట పడుతున్నామని చెప్పడం విశేషం.


ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో... అందరూ పని ఒత్తిడికి గురౌతున్నారు.అంతేకాదు... తమ భాగస్వామి పనిలో పడి తమను నిర్లక్ష్యం చేస్తే... వారు.. మరొకరికి ఆకర్షితులవ్వడం లాంటి పొరపాట్లు చేస్తున్నారట. దీంతో... అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా విడాకులకు దారి తీస్తోంది.

అంతేకాదు... దంపతులు ఒకరి కి మరొకరు గౌరవం ఇవ్వకపోవడం.. ఒకరి ఆలోచనలను మరొకరు గుర్తించకపోవడం వల్ల కూడా.. అభిప్రాయ బేధాలు వచ్చి.. విడాకుల దారి పడుతున్నారట. ఇద్దరం సమానమే అని  కాకుండా.. నేను గొప్పంటే.. నేను గొప్ప అని వాదించుకోవడం వల్లే.. సమస్య పెద్దదిగా మారుతోందట.

దేశంలో విడాకులు తీసుకుంటున్న వారిలో 72 శాతం మంది మహిళలు.. తమ వైవాహిత జీవితంలో భర్తతో కలయిక విషయంలో అసంతృప్తిగా ఉన్నారని ఓ సర్వేలే వెల్లడైంది. అదేవిధంగా 12శాతం మంది తమ భర్తతో శారీరక సంబంధమే లేదని చెప్పారట. ఇక 8శాతం మంది మహిళలు ఇష్టం లేకున్నా.. వివాహేతర సంబంధాలకు అలవాటు పడుతున్నారని తేలడం గమనార్హం.
 

Divorce

ఇదిలా ఉండగా... లైంగికపరమైన సమస్యల విషయంలోనూ 23.6శాతం మంది పురుషులు, 17.6 శాతం మహిళలు.. తమ భాగస్వాములను మోసం చేస్తున్నారట.  నిజాలు చెప్పకుండా దాచేస్తున్నారట. కొందరు పరుషులు తమలో ఉన్న లోపాన్ని దాచి పెళ్లి చేసుకుంటున్నారట. ఆ విషయం తర్వాత తెలిసి గొడవలు, విడాకులు జరగడం లాంటివి జరుగుతున్నాయట. 

శృంగారానికి సంబంధించిన విషయాలపై దంపతుల మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయాల్లో దంపతుల్లో ఎవరో ఒకరు పరాయి వ్యక్తులతో శృంగారం చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. ఇది క్రమంగా సంసారంలో చిచ్చుకు కారణమవుతుంది. కొందమంది పరిశోధకులు.. 20నుంచి 65ఏళ్ల వయసున్న పురుషులు, స్త్రీలను ప్రశ్నించారు.

దేశంలో 30శాతం వివాహాలు లైంగిక అసంతృప్తి, నపుంసకత్వం తదితర కారణాల వల్ల దంపతులు విడిపోతున్నారని వెళ్లడైంది. లైంగిక సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలిి అనే  అవగాహన కూడా చాలా మందిలో ఉండటం లేదట. దీని వల్లే సమస్యలు విడాకుల దాకా వెళ్తున్నాయట.

Latest Videos

click me!