ఈ ఐదు పండ్లు చాలు కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా కరిగించడానికి..

Published : Sep 10, 2022, 11:11 AM IST

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు. అందుకే కొలెస్ట్రాల్ ను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.   

PREV
18
 ఈ ఐదు పండ్లు చాలు కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా కరిగించడానికి..
high cholesterol

కొలెస్ట్రాల్ ఎన్నో ప్రమాదకరమైన  అనారోగ్య  సమస్యలకు దారితీస్తుంది. కానీ ఈ సమస్యను ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఆయిలీ ఫుడ్ ను తినడం, చెడు జీవన శైలి, మోతాదుకు మించి తినడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. కానీ కొలెస్ట్రాల్ వల్ల  గుండెపోటుతో పాటుగా గుండెకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ కొలెస్ట్రాల్ మొత్తం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపెడుతుంది.  

28
cholesterol

కొలెస్ట్రాల్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలాగే వికారం, ఛాతి బరువెక్కడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. అలాగే అలసట కూడా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు బయటి ఫుడ్ ను అస్సలు తినకూడదు. ఆయిలీ ఫుడ్ కు కూడా దూరంగా ఉండాలి. అయితే కొన్ని రకాల పండ్లు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

38

టమాటాలు

టమాటాలు కూడా కొలెస్ట్రాల్ ను సులువుగా కరిగిస్తాయి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ అధిక రక్తపోటును నియంత్రించడంతో పాటుగా కొలెస్ట్రాల్ ను కూడా కరిగించడానికి సహాయపడతాయి. ఈ కూరగాయను రోజూ కొంత మొత్తంలో తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

48
papaya

బొప్పాయి

బొప్పాయిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బొప్పాయి పండును కొంత మొత్తంలో తింటే రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనిలో గుండెను ఆరోగ్యంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పచ్చి బొప్పాయిలో ఉంటాయి. దీనిలో కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచే ఫైబర్ కంటెంట్, వివిధ రకాల విటమిన్లు, పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

58

అవకాడో

అవకాడోలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని రోజూ కొంతమొత్తంలో తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. ఈ అవకాడోలు స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తాయి. అలాగే గుండెను సురక్షితంగా ఉంచుతాయి. ఒక మామూలు సైజు అవకాడోలో 4 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కేలరీలు 99 ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను వెన్నలా కరిగించడానికి కూడా సహాయపడుతుంది. 
 

68

యాపిల్ పండు

యాపిల్ పండు ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందుకే రోజూ ఒక ఆపిల్ పండును తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. ఈ పండులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్ ను వేగంగా కరిగించడానికి సహాయపడతాయి. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 

78

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ సి జుట్టును, చర్మాన్ని కూడా కాపాడుతాయి. ఇందుకోసం ద్రాక్ష, నారింజ, నిమ్మ, బొప్పాయి వంటి పండ్లను రోజూ కొంత మొత్తంలో తినండి. 

88

పెరిగిన కొలెస్ట్రాల్ వల్ల షుగర్ వ్యాధి, గుండె పోటు, గుండె జబ్బలు, కొరొనరీ డిసీజ్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలని నిపుణులు చెబుతుంటారు. క్యారెట్లు తింటే కూడా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. కానీ వీటిని మోతాదులోనే తినాలి. 

Read more Photos on
click me!

Recommended Stories