కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గించే సహజ మార్గాలు..

First Published Aug 19, 2022, 12:54 PM IST

రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది ఎన్నో రకాల ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. కానీ పెరిగిన  కొలెస్ట్రాల్ ఎలాంటి సంకేతాలను చూపించదు. దీనివల్లే ఎంతో మంది జీవితాలు ప్రమాదంలో పడిపోతున్నాయి. 

high cholesterol

మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్  అంటే అధిక సాంద్రత కలిగిన లిపిప్రోటీనన్ (HDL). రెండోది తక్కువ సాంద్రత కలిగినన లిపోప్రోటీన్ అయిన చెడు కొలెస్ట్రాల్  (LDL).మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయా? లేక ఎక్కువగా ఉన్నాయా అనేది కేవలం రక్త పరీక్ష ద్వారానే గుర్తించగలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, మధుమేహం, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకే ఏ మాత్రం డౌట్ వచ్చినా వెంటనే డాక్టర్ వద్దకు వెల్లడం ఉత్తమం. 

High Cholesterol

ఆరోగ్యకరమైన శరీరం కోసం కొలెస్ట్రాల్ ను సహజంగా తగ్గించుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

healthy food

ఆరోగ్యకరమైన ఆహారం.. 

ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని చెప్పడం సులువే కానీ.. పాటించడం కష్టం. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే మాత్రం వీటిని పాటించక తప్పదు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు ఖచ్చితంగా ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు ఉప్పు, చక్కెరను కూడా మోతాదులోనే తీసుకోవాలి. 
 

oats

బీన్స్, ఓట్ మీల్, బ్రస్సెల్స్ మొలకలు, కిడ్నీ బీన్స్, ఆపిల్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా తింటూ ఉండండి. 

అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే వాల్ నట్స్, సాల్మాన్ చేపలు, అవిసె గింజలను కూడా తీసుకోండి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్త నాళాలకు కూడా సహాయపడతాయి. 

ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించండి..

దోస్తుగాల్లతో ముచ్చటేస్తూ.. ఆల్కహాల్ ను తాగడం బాగానే అనిపించినప్పటికీ ఇది మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అందులో మితిమీరి తాగడం వల్ల శరీరంలో అవయాలు దెబ్బతింటాయి. అంతేకాదు శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. 
 

బరువు తగ్గడం

అధిక బరువు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ బరువు గుండెను ప్రమాదంలో పడేస్తుంది. ఈ బరువు వల్ల పొత్తికడుపు చుట్టూ విసెరల్ ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇది మీ కాలెయాన్ని దెబ్బతీస్తుంది. సాధారణంగా అధిక బరువున్న వారి ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది మీ రక్తనాళాలు, ధమనులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. 
 

ఇలాంటి వారు బయట ఫుడ్ ను తినకూడదు. ఇంట్లో వండిన ప్రోటీన్ ఫుడ్ నే తినండి. ఇది మీ శరీర బరువును తగ్గిస్తుంది. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు , విత్తనాలు, గింజలను ఎక్కువగా తింటూ ఉండండి. అలాగే నీటిని పుష్కలంగా తాగండి. వీటితో పాటుగా క్రమం తప్పకుండా బరువు తగ్గేందుకు వ్యాయామం చేయండి. 

smoking

స్మోకింగ్ మానేయండి..

స్మోకింగ్ వల్ల మన శరీరంపై తీవ్రమైన చెడు ప్రభావం పడుతుంది. దీన్ని కాల్చడం వల్ల గుండె, హృదయ స్పందన రేటుపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ధమనుల గోడలకు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. పొగాకు అలవాటును మానుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. రక్తప్రసరణ కూడా బాగుంటుంది. అలాగే  మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా మెరుగుపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. 
 

మీకో విషయం తెలుసా.. స్మోకింగ్ మానేసి ఏడాది అయిన వారిలో గుండె జబ్బుల ప్రమాదం సగానికి సగం తగ్గాయని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఈ అలవాటును వీలైనంత తొందరగా మానేయండి. 
 

యాక్టివిటీ, ఎక్సర్ సైజ్  ను పెంచండి

లగ్జరీగా ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం గొప్ప విషయమే. కానీ ఎక్కువ సేపు కూర్చో వల్ల మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. అందుకే సమయం కుదుర్చుని మరీ నడవండి. శారీరక శ్రమను పెంచండి.  మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి వ్యాయామం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు ఈత, నడక, సైక్లింగ్, డ్యాన్స్ వంటి వాటిని చేయొచ్చు. 
 

click me!