సమంత బరువు తగ్గడం కోసం ఏ చేస్తుందో తెలుసా?

First Published | Mar 13, 2024, 11:01 AM IST

కొన్ని రోజుల నుంచి సమంత వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తూ వస్తోంది. వీటికి సంబంధించిన ఫోటోలు పిచ్చ హాట్ గా ఉన్నాయి. ఏదేమైనా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్ని ఏండ్లలో సమంత లావైనా దాకలాలు లేవు. అసలు సమంత బరువు పెరగకుండా ఉండేందుకు ఏం చేస్తుందో మనం కూడా తెలుసుకుందాం పదండి. 
 

అదిరిపోయే అవుట్ ఫిట్లలో సామ్ ఆకట్టుకుంటోంది. నయా ఫ్యాషన్ ను తన అభిమానులకు పరిచయం చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. 

సమంత ఎంత ఫిట్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ టోన్డ్ ఫిజిక్ కోసం చాలా కష్టపడుతుంది. ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అసలు సమంత ఫిట్‌నెస్ సీక్రెట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


వ్యాయామం

సమంత వ్యాయామం కోసం పెద్దగా ఏం ఉపయోగించదు. అంటే పరికరాలు లేని పూర్తి శరీర వ్యాయామమే సమయంతకు ఎక్కువ ఇష్టం. ఇవి చాలా ఈజీ కూడా.  వీటిని మీరు కూడా ఇంట్లోనే చాలా సులువుగా ప్రయత్నించొచ్చు. 

ఏరియల్ యోగా

వోగ్ ప్రకారం.. ఈ సౌత్ ఇండియన్ బ్యూటీ ఏరియల్ యోగాను ప్రతి రోజూ ప్రాక్టీస్ చేస్తుంది. యోగా శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇది శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. 

Samantha

రోప్ ట్రైనింగ్ 

సమంత తన శరీర బరువును మెయింటైన్ చేయడానికి ఎన్నో పనులు చేస్తుంది. వీటిలో  రోప్ ట్రైనింగ్ వ్యాయామాలు ఒకటి. సమయం బరువు పెరగకుండా ఉండేందుకు ప్రతి రోజూ రోప్ ట్రైనింగ్ ను ప్రాక్టీస్ చేస్తుంది. ఇది ఆమెను ఫిట్ గా ఉంచుతుంది. 

సైక్లింగ్

సమంత ప్రతి రోజూ సైక్లింగ్ తప్పకుండా చేస్తుందట. రోజూ కొద్ది సేపు సైకిల్ తొక్కుతూ ప్రకృతి అందాలను ఆస్వాధిస్తుందట. సమయం టోన్డ్ లుక్‌ని పొందడానికి తన రోజువారీ వ్యాయామ దినచర్యలో సైకిల్ తొక్కడం కూడా ఉంది. సైక్లింగ్ అనవసరమైన ఫ్యాట్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. 
 

బరువులెత్తడం

సమంత ఫిట్ గా ఉండే విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు. ఇందుకోసం ఎన్ని పనులనైనా చేస్తుంది. సమంత ఫిట్ గా ఉండటానికి, కేలరీలను  కరిగించడానికి ప్రతి రోజూ వెయిట్ లిఫ్టింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

click me!