బొప్పాయి
బొప్పాయిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. బొప్పాయి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కు భాండాగారం. బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, పెపైన్ ఎంజైమ్ లు ముఖం మీద ఉండే మృతకణాలను తొలగించడానికి సహాయపడతాయి. బొప్పాయి ముఖంపై ఉండే నల్లటి మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. ఇందుకోసం ముందుగా బాగా పండిన బొప్పాయి ముక్కను తీసుకుని సన్నగా తరగండి. దీనిలో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలగలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.