Saree Markets: భారత్‌లో కొన్ని హోల్ సేల్ మార్కెట్లలో చీరలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఇక్కడ కేవలం రూ.150 ధరకే అద్భుతమైన చీరలు లభిస్తాయి. ఆ మార్కెట్లు మనదేశంలో ఎక్కడున్నాయి? ఆ మార్కెట్ ప్రత్యేకతేంటో తెలుసుకోండి.
మనకు చీరలంటే చాలా ఇష్టం. పండగైనా, పెళ్లైనా, ఆఫీసుకైనా ప్రతి దానికి చీర కట్టేందుకే ఇష్టపడేవారు ఎంతో మంది. చీర కడితే వచ్చే ఆ అందమే వేరు. మంచి క్వాలిటీ చీరలు కొనాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు. కానీ మన దేశంలోని కొన్ని హోల్ సేల్ చీరల మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ చీరలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. కేవలం 150 రూపాయల నుంచే ఇక్కడ చీరలు లభిస్తాయి. ఇంతకీ ఆ మార్కెట్లు ఎక్కడున్నాయో, వాటి ప్రత్యేకతలేంటో ఇక్కడ తెలుసుకుందాం. మన దేశంలోని కొన్ని చారిత్రక హోల్‌సేల్ మార్కెట్లకు వెళ్తే, మీకు బెనారసీ, కంచిపట్టు, డిజైనర్ చీరలు సగం కన్నా తక్కువ ధరకే దొరుకుతాయి.
25
చాందినీ చౌక్, ఢిల్లీ
ఢిల్లీలోని చాందినీ చౌక్ కేవలం స్ట్రీట్ ఫుడ్‌కే కాదు, బట్టలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బెనారసీ, పట్టు, కాటన్ నుంచి మొదలుకొని బాలీవుడ్ సెలబ్రిటీలు కట్టుకునే డిజైనర్ చీరల వరకు అన్నీ లభిస్తాయి. అది కూడా చాలా తక్కువ ధరకే. ఇక్కడ చీరల ధర కేవలం 500 రూపాయల నుంచి మొదలవుతుంది. కినారీ బజార్, కత్రా నీల్ వంటి ప్రాంతాల్లో హోల్‌సేల్ ధరకే సింగిల్ పీస్ చీరలు కూడా కొనుక్కోవచ్చు. ఉదం నుంచి పది నుంచి రాత్రి 9 వరకు ఈ మార్కెట్లు నడుస్తాయి. ఆదివారం మాత్రం మార్కెట్ మూసేస్తారు.
35
బుర్రా బజార్, కోల్‌కతా
కోల్ కతాలో ఫేమస్ చీరల మార్కెట్ బుర్రా బజార్. ఇక్క బెంగాలీ చేనేత చీరలు నుంచి ఆఫీస్ వేర్ చీరల వరకు అన్నీ లభిస్తాయి. ఇక్కడ కేవలం 150 నుంచి 3000 రూపాయల లోపు రోజువారీ, పార్టీ వేర్ చీరలు దొరుకుతాయి. బాంధనీ, సింథటిక్, సాంప్రదాయ బెంగాలీ కాటన్ చీరలకు ఈ మార్కెట్ చాలా ఫేమస్. ఈ మార్కెట్ కూడా ఉదయం పది నుంచి రాత్రి 9 గంటల వరకు నడుస్తుంది. ఆదివారం ఓపెన్ చేయరు.
ముంబైలోని మంగళ్‌దాస్ మార్కెట్ ఎంతో ఫేమస్. ఇక్కడ ఇండో-వెస్ట్రన్, లేటెస్ట్ ప్రింటెడ్ చీరలు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. జార్జెట్, పట్టు, బెనారసీ, ఆఫీస్ వేర్ చీరలలో కొత్త కొత్త డిజైన్లు ఇక్కడ ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వందలాది చీరల దుకాణాలు ఉంటాయి. ఉదయం 10:30 నుంచి రాత్రి 8:00 వరకు ఈ మార్కెట్ పనిచేస్తుంది. ఆదివారం మాత్రం ఉండదు.
55
షాపింగ్ చేసేటప్పుడు ఈ టిప్స్ గుర్తుంచుకోండి
పైన చెప్పిన మార్కెట్లలో చీరల కొనేటప్పుడు కొన్ని టిప్స్ పాటించండి. ఇక్కడ చెప్పిన ధరకే చీరను కొనకూడదు, బేరమాడాలి. వాళ్లు చెప్పిన ధర కన్నా 30 శాతం వరకు తక్కువ ధరకు బేరమాడొచ్చు. ఈ మార్కెట్లు ఎప్పుడూ జనంతో కిక్కిరిసి ఉంటాయి. కాబట్టి ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటే ఉదయాన్నే వెళ్లడం మంచిది. ఇక్కడ చిన్న షాపులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆన్ లైన్ పేమెంట్ కన్నా డబ్బులు తీసుకునేందుకు వారు ఇష్టపడతారు.