ఉల్లిపాయతో టీ.. తాగితే చెడు కొలెస్ట్రాల్ నుంచి గుండె జబ్బుల వరకు ఎన్ని రోగాలు తగ్గిపోతాయో..!

Published : Feb 02, 2023, 09:46 AM IST

శరీరం పెరిగిపోతుంటే కంగారు పడాల్సిందే..! ఎందుకంటారేమో.. మీ వెయిట్ పెరుగుతుందంటే మీ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతున్నట్టే లెక్క. ఈ కొలెస్ట్రాల్ ను చిన్న సమస్యగా అస్సలు భావించకూడదు. ఎందుకంటే ఇది మీ ప్రాణాలను అలవోకగా తీసేయగలదు. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, ఊబకాయం వంటి ఎన్నో ప్రాణాలను తీసే రోగాలు వస్తయ్.   

PREV
16
ఉల్లిపాయతో టీ.. తాగితే చెడు కొలెస్ట్రాల్ నుంచి గుండె జబ్బుల వరకు ఎన్ని రోగాలు తగ్గిపోతాయో..!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి యువత వరకు ప్రతి ఒక్కరూ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మనమే కారణం. లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల మూలంగానే ఒంట్లో కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. మనలో చాలా మంది ఇష్టమైన ఆహారాన్ని తింటున్నప్పుడు అది మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అన్న సంగతిని పట్టించుకోరు.  ఆయిల్ ఫుడ్ ను ఎక్కువగా తినడం, వ్యాయామం మొత్తమే చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. 

26

అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎన్నో పద్దతులు ఉన్నాయి. అందులో ఉల్లిపాయ టీ ఒకటి. అవును ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదన్న సామేతను మీరు వినే ఉంటారు కదా.. ఉల్లిపాయతో ఎన్నో రోగాలు నయమవుతాయి. అందులో కొలెస్ట్రాల్ తగ్గడం కూడా ఉంది. ఉల్లిపాయతో తయారుచేసిన టీని తాగితే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇట్టే కరిగిపోతాయంటున్నారు నిపుణులు. పిప్పరమెంట్ టీ, చామంతి టీ, మందారం వంటి టీలను తాగే వారు చాలా మందే ఉన్నారు కానీ ఉల్లిపాయ టీని తాగేవారు చాలా తక్కువే..కానీ ఉల్లిపాయ టీని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉల్లిపాయ టీలలో ఫ్లేవనాయిడ్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. అసలు ఉల్లిపాయ టీని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36
cholesterol

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

ఉల్లిపాయ మన శరీరంలో చెడు లిపిడ్లు పేరుకుపోకుండా నివారిస్తుంది. అంటే ఉల్లిపాయ టీ మన శరీరంలో ఎక్కువైన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుందన్న మాట. ఉల్లిపాయ టీని తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది రక్త నాళాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడుతుంది కూడా. మంచి కొలెస్ట్రాల్ పెరిగితే చెడు కొలెస్ట్రాల్ ఆటోమెటిక్ గా తగ్గిపోతుంది. 

46

రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఉల్లిపాయలలో కొన్ని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ రెండూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. రక్త నాళాల గోడలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఈ విధంగా అధిక కొలెస్ట్రాల్, పేలవమైన రక్త ప్రసరణ సమస్యను తగ్గించడానికి ఉల్లిపాయ టీ ప్రయోజనకరంగా ఉంటుంది.
 

56
heart

గుండెకు మేలు చేస్తుంది

ఉల్లిపాయ టీలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర మంటను తగ్గిస్తాయి. ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. అలాగే ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత తగ్గిస్తుంది. ఈ టీలో ఉండే శోథ నిరోధక లక్షణాలు అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి సహాయపడతాయి.
 

66

ఉల్లిపాయ టీ ఎలా తయారు చేయాలి?

ఉల్లిపాయ టీని చాలా సులువుగా తయారుచేయొచ్చు. ముందుగా ఒక ఉల్లిపాయను కట్ చేసి 2 కప్పుల నీటిలో వేసి మరిగించండి. ఈ నీరు సగం అయ్యే వరకు మరిగిస్తూ ఉండండి. ఈ తర్వాత ఈ నీటిని వడకట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి కలపండి. కావాలనుకుంటే కొద్దిగా ఉప్పును కూడా కలుపుకోవచ్చు. ఈ టీని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచిది. 
 

Read more Photos on
click me!

Recommended Stories