ఆకలి వేయడం లేదా? అయితే ఇలా చేయండి..

Published : Mar 20, 2022, 11:19 AM IST

కొంతమందికి ఆకలి ఎక్కువగా వేస్తే.. మరికొంతమందికి మాత్రం మొత్తమే ఆకలి వేయదు. తినకపోవడం వల్ల సర్వరోగాలు వీరికే వచ్చే ప్రమాదముంది. ముఖ్యంగా ఊరికే అలసిపోయి నీరసంగా కనిపిస్తూ ఉంటారు. 

PREV
17
ఆకలి వేయడం లేదా? అయితే ఇలా చేయండి..

కొంతమంది బాగా తింటే.. మరికొంతమంది మాత్రం  అసలుకే తినరు. ఎంతచెప్పినా.. ముద్ద కూడా తినని వారు చాలా మందే ఉన్నారు. ఏమన్నా అంటే ఆకలి వేయడం లేదు మరి ఎట్ల తినాలి? అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. తినకపోవడం వల్ల నీరసంగా మారడమే కాదు.. ఏ పనిచేయడానికి కూడా చేతకాదు. 
 

27

అంతేకాదు వీరు ఎప్పుడూ అలసిపోయినట్టుగానే ఉంటారు. ఇలాంటి వారికే ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి ఆకలిని పెంచుతాయి.. అవేంటో చూద్దాం.. 

37

కొద్దిగా అల్లం తీసుకుని దాన్నుంచి రసాన్ని తీయాలి. టీ స్పూన్ అల్లం రసంలో కాస్త రాక్ సాల్ట్ ను యాడ్ చేయాలి. దీన్ని అన్నం తినడానికి ఒక అరగంట ముందు తాగాలి. ఇలా పదిరోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మీకు ఆకలి బాగా అవుతుంది. 
 

47

అర టీస్పూన్ నల్లమిరియాల పౌడర్ లో టీ స్పూన్ బెల్లం పొడిని వేసి బాగామిక్స్ చేయాలి. ఈ పౌడర్ ను  రోజులో ఏదో ఒక సమయంలో తింటే ఆకలి వద్దన్నా ఆగదు. 

57

కొద్దిగా నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా తేనె, ఉసిరికాయ సరం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పూట పరిగడుపున రెండు టేబుల్ స్పూన్లు తాగాలి. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే బాగా ఆకలి వేస్తుంది.

67

తినే ముందు రెండు మూడు యాలకుల గింజలను నములుతూ ఉండాలి.  ప్రతిరోజూ యాలకులను నమిలితే.. మనం తిన్నది మంచిగా అరగడమే కాదు ఆకలి కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది.

77

కొంచెం నిమ్మరసం పిండి అందులో వామును వేసి ఎండలో కాసేపు ఉంచాలి. ఆ మిశ్రమానికి కాస్త నల్ల ఉప్పును మిక్స్ చేసి గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగాలి. ఈ పద్దతిని కొన్ని రోజులు పాటిస్తే .. ఆకలి దంచేయడం పక్కా.. 

Read more Photos on
click me!

Recommended Stories