
ఏజ్ మీద పడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు కనిపించడం సర్వ సాధారణం. ఇవి ముప్పై ఏండ్లు పైబడిన వారికి అప్పుడప్పుడే మొదలవుతుంటాయి.
ఈ ముడతలు కనిపించిన వెంటనే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ముడతలు తగ్గించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయినా ఈ ముడతలు అంత సాధారణంగా వదిలిపోవు. అయితే రెగ్యులర్ గా కొన్ని చిట్కాలను పాటిస్తే ఈజీగా వదిలిపోతాయి. దాంతో మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. ఇందుకోసం ఏం చేయాలంటే..
సన్ స్క్రీన్ లోషన్: ముఖం పై ముడతలు వస్తున్నట్టు అనిపిస్తే.. నిత్యం సన్ స్క్రీన్ లోషన్ ను ఖచ్చితంగా వాడాలి. ఈ ముఖంపై ముడతలు 90 శాతం యువీ కిరణాల ప్రభావం వల్లే వస్తుంటాయి. ఈ యువీకిరణాల వల్ల స్కిన్ సాగే గుణాన్ని కోల్పోతుంది. దీనివల్ల స్కిన్ కాంతం తగ్గుతుంది. అలాగే ముడతలు కూడా వస్తుంటాయి.
నీళ్లు తాగుతూ ఉండాలి: నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నీళ్లతోనే ఎన్నో రోగాలు మటుమాయం అవుతుంటాయి. అందుకే రోజుకు 8 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఒకవేళ మీరు నీళ్లను తాగకపోతే.. మీరు డీహైడ్రేషన్ బారిన పడి.. మీ స్కిన్ కాంతిని కోల్పోతుంది. డల్ గా కూడా మారుతుంది. దాంతో ముఖంపై ముడతలు కూడా వస్తుంటాయి. అదే నీళ్లు తాగితే ఈ సమస్యలేవీ రావు. మీ ఆరోగ్యం, మీ చర్మ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.
నిద్ర తప్పనిసరి: మనిషికి నిద్ర ఎంతో అవసరం. నిద్రతో ఎన్నో రోగాలు రావు. మీకు తెలుసా.. నిద్రపోతున్నప్పుడే చర్మకణాలు పునరుత్తేజం అవుతాయి. అంతేకాదు కొత్త కణాలు కూడా తయారవుతాయి. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
ఆకుకూరలు: తాజా ఆకు కూరలు, తాజా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు, ఆకు కూరగాయలల్లో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల ఎలాంటి హానీ కలగకుండా చేస్తాయి.
ఎత్తుకు తగ్గ బరువు: ఎత్తుకు తగ్గ బరువుంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఇది చాలా ముఖ్యం కూడా . నిత్య యవ్వనంగా కనిపించాలంటే మాత్రం మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిందే. అప్పుడే మీరు అన్నివిధాల బాగుంటారు.
వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు నిత్యం High Intensity Interval Training ఎక్సర్ సైజెస్ చేయాలి. వీటివల్ల వయసు మీద పడుతున్నా యువ్వనంగానే ఉంటారని పలు పరిశోధనలో తేలింది.
ఆల్కహాల్: ఆల్కహాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కానీ నేడు చాలా మంది దీనికి బానిసలుగా మారారు. దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటుగా చాలా తొందరగా ముసలివాళ్లుగా కనిపిస్తారు. దీనికి కారణం వీటిని ఎక్కువగా సేవిస్తే డీహైడ్రేట్ బారిన పడతారు. అంతేకాదు వీటివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభించవు.
కెఫిన్: టీ, కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ కెఫిన్ తక్కువ మొత్తంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదు కానీ.. ఎక్కువగా తీసుకుంటేనే చిక్కొస్తుంది. వీటిని ఎక్కువగా తాగితే బాడీ డీహైడ్రేషన్ బారిన పడటంతో పాటుగా.. నిద్రను కూడా దూరం చేస్తుంది. వీటిని ఎక్కువగా తాగితే శరీరానికి పోషకాలు కూడా అందవు.