బాదం, వాల్‌నట్స్ మరిన్ని...
ప్రతిరోజూ నీళ్లలో నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ తినేందుకు ప్రయత్నించాలి. వీటిలో జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే జింక్ టెస్టోస్టెరాన్ స్థాయిలను నిర్వహించేందుకు ఎంతో సహాయపడతాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అలాగే ప్రతిరోజూ చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తినేందుకు ప్రయత్నించండి. ఈ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి శక్తి లభించి, ఒత్తిడి తగ్గుతుంది.
అలాగే కొవ్వు పట్టిన చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక్కడ చెప్పిన ఆహారాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎంతో మంచిది.