గుండెపోటు రావడానికి నెల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి.. తేలిగ్గా తీసిపారేయకండి

First Published Nov 20, 2022, 9:59 AM IST

ఓ అధ్యయనం గుండెపోటు రావడానికి నెల ముందు రోగిలో కనిపించే 12 లక్షణాలను వెల్లడించింది. అసలు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుంటే ప్రాణాలతో బయటపడటం సులువు అవుతుంది. 
 

heart attack

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా హృదయ సంబంధ వ్యాధులు (సివిడిలు) అత్యధిక మరణాలకు కారణం. గుండెపోటు బారిన పడి ప్రతి ఏడాది 17.9 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. ఐదు సివిడి మరణాల్లలో నాలుగు కంటే ఎక్కువ స్ట్రోక్, గుండెపోటు వల్లే సంభవిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 

గుండెపోటును నిశ్శబ్ద కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఎలాంటి లక్షణాలను, హెచ్చరికలను చూపించకుండా ప్రాణాలు తీసేస్తుంది. సర్వేల ప్రకారం.. ప్రమాదంలో ఉన్న చాలా మందికి అసలు వాళ్లకు  ఈ వ్యాధి ఉందన్న సంగతి కూడా తెలియదు. కానీ ఓ సర్వే గుండెపోటు రావడానికి నెల ముందు కనిపించే లక్షణాలను, హెచ్చరిక సంకేతానలు వెల్లడించింది.. 
 

జర్నల్ సర్క్యూలేషన్ లో ప్రచురించబడిన ఈ సర్వేలో గుండెపోటుకు ముందు అనేక హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో గుండెపోటు నుంచి ప్రాణాలతో బయటపడిన 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. వీరిలో 95 శాతం మంది గుండెపోటుకు ముందు నెలలో లేదా అంతకంటే ఎక్కువ ముందు నెలలో కొన్ని లక్షణాలను గమనించారని వెల్లడించారు. 

వీరిలో 71 శాతం మంది అలసటను సాధారణ లక్షణంగా వెల్లడించారు. 48 శాతం మంది నిద్రలేమి సమస్యను ఫేస్ చేశారట. ఇంకొంతమంది విపరీతమైన అలసటను ఎదుర్కొన్నారు. వీరు ఎక్కువ సమయం విశ్రాంతిలోనే ఉన్నారట. కొంతమంది స్త్రీలు ఛాతిలో నొప్పిని కూడా గమనించారు. అయితే ఈ నొప్పిని నొప్పిగా కాకుండా.. ఛాతిలో బిగుతుగా, ఒత్తిడిగా చెప్పారు. 
 

heart attack

ఒక నెలకు ముందు ఆడవారిలో కనిపించిన 12 గుండెపోటు లక్షణాలు

అసాధారణ అలసట, నిద్రరాకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అజీర్థి, గుండె దడ, ఆత్రుత, చేతులు బలహీనపడటం, దృష్టి సమస్యలు,ఆకలి లేకపోవడం, చేతులు జలదరింపు, ముఖ్యంగా రాత్రిసమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

heart attack

ఈ లక్షణాలు కనిపించినా.. చాలా మంది ఈ సంకేతాలను తేలికగా తీసిపారేస్తారు. దీనివల్లే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె  ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా గుండె స్క్రీనింగ్ లు, వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ముఖ్యంగా రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డయాబెటీస్ ఉన్నట్టైతే.. షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకుంటూ ఉండండి. కొలెస్ట్రాల్ టెస్ట్ లు కూడా చేయించుకోండి. ఇవి మీ గుండెపోటు ప్రమాదాన్ని పెంచే కారకాలు. 

గుండెపోటుకు ఎవ్వరైనా గురికావొచ్చు. అయినప్పటికీ.. అధిక రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, డయాబెటీస్, మద్యపానం చేసే అలవాటు ఉన్నవాళ్లకు గుండె సమస్యలు తొందరగా వస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీ జీవన శైలి ఆరోగ్యకరమైందిగా ఉండాలి. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తినాలి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండాలి. ప్రాసెస్ చేసిన, ఆయిలీ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది. 
 

heart attack

గుండె ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువు ఎక్కువగా ఉండకూడదు. అధిక రక్తపోటు, బ్లడస్ షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు ఉంటే వెంటనే వదులుకోవడం మంచిది. 

ఒకవేళ మీకు గుండెపోటు లక్షణాలు మరీ ఎక్కువైతే.. క్షణం ఆలస్యం చేయకుండా దగ్గర్లోని హాస్పటల్ కు వెళ్లండి. ఉన్నట్టుండి ఒక వ్యక్తికి గుండెపోటు వస్తే.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడితే.. శరీరంలో రక్తప్రవాహం ఆగిపోకుండా చూడటానికి సిపిఆర్ చేయండి. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన మొదటి కొన్ని నిమిషాల్లో సిపిఆర్ నిర్వహిస్తే.. అతను బతికే అవకాశాలు రెండు మూడు రెట్లు పెరుగుతాయని పేర్కొంది. 

click me!