చలికాలంలో చన్నీటి స్నానం.. ఏమౌతుందో తెలుసా..?

Published : Nov 19, 2022, 04:54 PM IST

చలికాలంలో చన్నీటి స్నానం చాలా కష్టం. అందులోనూ ఇది చాలా డేంజర్ కూడా. ఈ సీజన్ లో చల్లని నీళ్లతో స్నానం చేసే గుండెపోటు తో పాటుగా పక్షవాతం మొదలైన రోగాలొచ్చే అవకాశం ఉంది.   

PREV
16
చలికాలంలో చన్నీటి స్నానం.. ఏమౌతుందో తెలుసా..?
bathing

రోజు రోజుకు చలి తీవ్రవ దారుణంగా పెరిగిపోతుంది. ఉదయం లేవడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఏ పూటకు ఆ పూట వండుకుని తినడమే బెటర్ అనిపిస్తుంది. చలి కాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్ లో పండే ఆహారాలను ఖచ్చితంగా తినాలి. అలాగే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఆహారాలను అసలే తినకూడదు. 

26

ఈ సీజన్ లో మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శీతాకాలంలో చిన్న సమస్య అయినా పెద్దదిగా మారి ప్రాణాల మీదికి వస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే ఈ చలికాలంలో మనం స్నానం ఎలా చేస్తున్నాం.. ఏ నీటితో చేస్తున్నామనేది చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలా మంది చలికాలంలో స్నానం చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఇంత చలిలో స్నానం చేస్తే.. ఇంకేమైనా ఉందా.. జ్వరం వచ్చేస్తుందని రోజు తప్పించి రోజో లేకపోతే రెండు మూడు రోజులకు ఒకసారో చేస్తుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ స్నానం చేయాల్సిందే. అయితే ఈ సీజన్ లో కొంతమంది వేడి వేడి నీళ్లతో చేస్తే.. ఇంకొంతమంది గడ్డకట్టించే చల్లని నీళ్లతో స్నానం చేస్తుంటారు. కానీ మరీ వేడినీళ్లు, మరీ చల్లనీటితో స్నానం చాలా డేంజర్. ముఖ్యంగా చన్నీటి స్నానం. చన్నీటి స్నానం వల్ల ప్రాణాలు పోవచ్చు. శీతాకాలంలో చాలా చల్లని లేదా చాలా వేడి నీటిలో స్నానం చేయడం హానికరమని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి కూడా. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం పదండి. 

36

పక్షవాతం

చలికాలంలో చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒక్కటేమిటీ ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. చల్లని నీటిలో స్నానం చేసిన తర్వాత స్ట్రోక్ బారిన పడిన వాళ్లు చాలా మందే ఉన్నారు.  ఇందుకు 68 ఏళ్ల వ్యక్తే ఉదాహరణ. సమాచారం ప్రకారం.. ఈ వ్యక్తి నదిలో స్నానం చేశాడు. అయితే 26 గంటల తర్వాత ఇతను మాట్లాడలేకపోయాడు. ఎమ్ ఆర్ ఐ పరీక్ష ఆధారంగా అతను ఇస్కీమిక్ స్ట్రోక్ బారిన పడ్డాడని డాక్టర్లు గుర్తించారు. 
 

46


గుండెపోటు

ఈ సీజన్ లో చల్లని నీటితో స్నానం చేయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. శరీరంపై చల్లని నీటిని పోయడం వల్ల Myocardial infarction బారిన పడొచ్చు. శీతాకాలంలో చాలా వేడిగా ఉండే నీటిలో స్నానం చేయడం కూడా మంచిది కాదు. వేడి నీటిలో స్నానం చేయడం వల్ల ప్రమాదకరమైన రోగాలొస్తయ్. ఎక్కువ వేడినీరు శరీరాన్ని తాకినప్పుడు చర్మ సమస్యలు వస్తాయి. వీడి నీటి వల్ల చర్మం పొడిబారుతుంది. దురద మొదలైన చర్మ సమస్యలు వస్తాయి. 
 

56

చలికాలంలో స్నానం చేయడానికి ఏ నీటిని ఉపయోగించాలి

చలికాలంలో స్నానం చేయడానికి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. నీటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉండకూడదు.
 

66

స్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

చల్లని వాతావరణంలో లేదా శీతాకాలంలో స్నానం చేయడానికి షవర్ ను ఉపయోగించకూడదు. ఒక బకెట్ గోరువెచ్చని నీటిని తీసుకుని స్నానం చేయండి. శరీరంపై పోయడానికి ముందు కొన్ని నీళ్లను తీసుకుని మీ కాళ్లు, చేతులపై నీటిని చల్లండి. దీనివల్ల నీటి ఉష్ణోగ్రత సంకేతం మెదడుకు చేరుతుంది. దీని ఆధారంగా శరీర ఉష్ణోగ్రతను మెదడు నియంత్రిస్తుంది. శీతాకాలంలో నదిలో లేదా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడం మంచిది కాదు. ఒకవేళ మీరు అధిక రక్తపోటు పేషెంట్లు అయితే.. స్నానం చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
 

Read more Photos on
click me!

Recommended Stories