Heart attack risk: ఈ వ్యక్తులకే గుండెపోటు ప్రమాదం ఎక్కువ..

Published : May 28, 2022, 12:58 PM IST

Heart attack risk: గుండెను ఆరోగ్యంగా ఉంచుకుంటునే మీరు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. లేకపోతే ఎన్నో వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.   

PREV
110
Heart attack risk: ఈ వ్యక్తులకే గుండెపోటు ప్రమాదం ఎక్కువ..

గుండె లేని జీవితం ఊహించడం కష్టమేమో.. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆగకుండా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఇది ఆరోగ్యంగా ఉన్నంత కాలమే మనం ఆరోగ్యంగా ఉండేది. అందుకే దీనిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ కొంతమంది గుండె ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వారికే గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెకు సంబంధించిన ఏ వ్యాధైనా అటాక్ చెసినప్పుడు కొన్ని హెచ్చరికలు, చిహ్నాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. 
 

210

ఈ వ్యాధుల నుంచి మీ గుండెను రక్షించండి.. గుండెపోటు (Heart attack), కొరోనరీ డిసీజ్ (Coronary artery disease), ట్రిపుల్ వెసల్ డిసీజ్ వంటి వ్యాధులు మీ గుండెను మరింత ప్రమాదంలో పడేస్తాయి. అందుకే ఇవి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

310

గుండెపోటు నివారణా మార్గాలు.. క్రమం తప్పకుండా బరువును చెక్ చేసుకోవాలి. అలాగే బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. 

410

స్థూలకాయుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతూనే ఉంది. దీనివల్ల గుండెపోటుతో పాటుగా ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశం ఉంది. అందుకే స్థూలకాయులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. 

510

అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ రోజుల్లో ఈ వ్యాధి సర్వసాధారణంగా మారింది. ఇలాంటి వారుకూడా హార్ట్ ఎటాక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ హై బీపీ పేషెంట్లు ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే కాఫీని తాగడం కూడా తగ్గించాలి. 

610

ముఖ్యంగా చిన్న చిన్న వాటికి టాబ్లెట్లను వేసుకోకూడదు. ఒకవేళ వేసుకున్నా డాక్టర్ న సంప్రదించాలి. అలా కాకుండా మీకు మీరే డిసైడ్ చేసుకుని ట్యాబ్లెట్లను వేసుకుంటే మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. 
 

710

నడుస్తున్నప్పుడు లేదా పరిగెడుతున్నప్పుడు మీ గుండె కొట్టుకోవడంలో ఏదైనా సమస్య ఉన్నట్టైతే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఇది హార్ట్ ఎటాక్ కు సంకేతం కావొచ్చు. అలాగే ఆయిలీ ఫుడ్ కూడా తీసుకోకూడదు. 

810

ఏ రకమైన ఆహారం తీసుకోవాలి.. గుండె ఆరోగ్యానికి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.  దీనికోసం ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినాలి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లను ఎక్కువగా తినాలి. మసాలా ఫుడ్స్ తినకపోవడమే మంచిది. 

910

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారంతో పాటుగా శారీరక కార్యకలాపాలు కూడా అవసరం. శారీరక శ్రమ లేకపోతే.. శరీరంలో కొవ్వుపెరుగుతుంది. ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుది. 

1010

వీటితో పాటుగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సిగరెట్లకు దూరంగా ఉండాలి. సిగరేట్లు గుండె ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తాయి. అందుకే  వీటిని కాల్చడం మానుకోండి. 

Read more Photos on
click me!

Recommended Stories