Heart Attack Risk: ఈ అలవాట్లే గుండెపోటుకు దారితీస్తాయి.. తస్మాత్ జాగ్రత్త..

Published : May 11, 2022, 08:58 AM IST

Heart Attack Risk: గుండె ఆరోగ్యం బావుంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అయితే కొన్ని బ్యాడ్ హాబిట్స్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు వీటి వల్ల గుండెపోటు వచ్చే అవకాశం  కూడా ఉంది. 

PREV
114
Heart Attack Risk: ఈ అలవాట్లే గుండెపోటుకు దారితీస్తాయి.. తస్మాత్ జాగ్రత్త..

Heart Attack Risk: మన ఆరోగ్యం బాగుండాలంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వీటివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. మరి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లను వదులుకోవాలో తెలుసుకుందాం. 
 

214
obesity

ఈ వ్యక్తులకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది.. 

ప్రస్తుత కాలంలో అధిక బరువు, ఊబకాయం, పొట్టకొవ్వుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజు పెరిగిపోతూనే ఉంది. దీనికి కారణం.. శారీరక శ్రమ చేయకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు. అయితే ఈ సమస్యతో బాధపడేవారే గుండెపోటు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

314

ముఖ్యంగా మీ ఫ్యామిలీలో ఎవరికైనా గుండెకు సంబంధిత సమస్యలు, గుండెపోటు చరిత్ర ఉన్నవారుంటే ఇంటిల్లిపాది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిగతా వారు కూడా గుండెపోటు బారిన పడే అవకాశం ఉంది. 
 

414

ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇది వయసుతో సంబంధం లేకుండా వస్తోంది. అయితే వీరికి కూడా హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

514

ప్రస్తుత కాలంలో జనాలంతా స్మార్ట్ వర్క్ కే అలవాటు పడిపోయారు.  దీనివల్ల ఎలాంటి సమస్య లేదు కానీ.. దీనితో పాటుగా శరీరక శ్రమ లేకపోతేనే అసలుకే మోసం వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే గుండె జబ్బులు సోకే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.  

614

నేటి యువత స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు చూస్తూ తెల్లవార్లూ మేల్కువగానే ఉంటున్నారు. ఎప్పుడో తెల్లవారు జామున మూడు, నాలుగు గంటలకు నిద్రపోతున్నారు. దీనికి తోడు ఎంతో మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కంటి నిండా నిద్రలేని వారు కూడా గుండె జబ్బుల బారిన  పడే అవకాశం ఉంది. 

714

చెడు ఆహారపు అలవాట్లు, సమయానికి తినకపోవడం వంటి కారణాల వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాదు గుండెపోటు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 
 

814

చిన్న చిన్న సమస్యలకు కూడా ట్యాబ్లెట్లు వేసుకోవడం, వైద్యుడిని సంప్రదించకుండా మెడిసిన్స్ ను యూజ్ చేస్తే కూడా గుండెపోటు వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

914

గుండెపోటు రాకూడదంటే.. గుండె పోటుకు గురికాకూడదంటే మొదటగా మీ ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి. ఇందుకోసం మీరు తాజా పండ్లను, కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే గుండె ఫిట్ గా ఉంటుంది. 

1014

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ను తినడం వల్ల సిరల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండండి. 

1114

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వ్యాయామం వల్ల మీ బాడీ ఫిట్ గా ఉండటమే కాదు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. 
 

1214

శరీర బరువు నియంత్రణలో ఉంటేనే మీరు ఎలాంటి జబ్బుల పాలు కాకుండా ఉంటారు. అందుకే క్రమం తప్పకుండా మీ బరువును చెక్ చేస్తూ ఉండండి. బరువును నియంత్రించడానికి ప్రయత్నాలను మాత్రం ఆపకండి. 
 

1314

సిగరేట్లు, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండండి. ఈ అలవాట్ల వల్ల ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాదు.. గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. 

1414

ఉప్పును ఎక్కువగా తీసుకోరాదు. అంటే సోడియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకుంటే మీ రక్తపోటు అమాంతం పెరుగుతుంది. దీంతో మీరు హార్ట్ ఎటాక్ బారిన పడతారు. 

Read more Photos on
click me!

Recommended Stories