హెల్తీ రాగి చాక్లెట్ కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

Navya G   | Asianet News
Published : Feb 15, 2022, 02:13 PM IST

ఇంట్లో కేక్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు. నిజానికి బేకరీలో (Bakery) దొరికే మైదా కేక్ ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక ఇంటిలోనే హెల్తీ పదార్థాలతో చేసుకునే రాగి చాక్లెట్ కేక్ (Ragi chocolate cake) ను ట్రై చేయండి. ఈ కేక్ ను చేసుకుని మీ కుటుంబ సభ్యుల నోరు తీపిని చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఈ కేక్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

PREV
17
హెల్తీ రాగి చాక్లెట్ కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా.. ఎంత రుచిగా ఉంటుందో తెలుసా?

కావలసిన పదార్థాలు: ముప్పావు కప్పు రాగి పిండి (Ragi flour), ముప్పావు కప్పు గోధుమపిండి (Wheat flour), సగం కప్పు చక్కెర పొడి (Sugar powder), ఒకటిన్నర స్పూన్ ల బేకింగ్ పౌడర్ (Baking powder), సగం స్పూన్ బేకింగ్ సోడా (Baking soda), ఒకటిన్నర కప్పు పాలు (Milk),

27

పావు కప్పు కోకో పొడి (Cocoa powder), పావు స్పూన్  వెనీలా ఎసెన్స్ (Vanilla Essence), సగం కప్పు కరిగించిన వెన్న (Butter), చిటికెడు ఉప్పు (Salt), 150 గ్రాముల  డార్క్ చాక్లెట్ (Dark chocolate), 250 ml ఫ్రెష్ క్రీమ్ (Fresh cream), కొన్ని బాదం (Almonds) పలుకులు, కొద్దిగా రాళ్ల ఉప్పు (Rock salt).

37

తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని ఇందులో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కోకో పౌడర్, చక్కెర పొడి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు ఇందులో పాలు, వెనిలా ఎసెన్స్, కరిగించిన వెన్న వేసి ఒకే డైరెక్షన్ (Single direction) లో బాగా కలుపుతూ ఉండాలి.

47

అయితే పిండి కలిపినప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. పిండిని ఓకే డైరెక్షన్ లో కలవడం ముఖ్యం. ఇప్పుడు ఒక అల్యూమినియం పాత్రను (Aluminum bowl) తీసుకుని ఈ పాత్రకు అన్నివైపులా వెన్న రాసి కొంచెం పొడి పిండిని చల్లుకోవాలి. ఇప్పుడు ఇందులో కేక్ మిశ్రమాన్ని వేసి సమానంగా పరచాలి.

57

ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో రాళ్ల ఉప్పును మందంగా వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండా (Without whistling) ఐదు నిమిషాల పాటు వేడి  చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఇందులో కేక్ మిశ్రమం ఉన్నా పాత్రను నుంచి మూతపెట్టి తక్కువ మంట (Low flame) మీద దాదాపు 45 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.

67

తర్వాత మూత తీసి టూత్ పిక్ (Tooth pick) ను కేకులో గుచ్చితే కేక్ మిశ్రమం ఏమాత్రం అంటకుంటే కేక్ రెడీ అని అనుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కేకును చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో చాక్లెట్ ముక్కలు, ఫేస్ క్రీమ్ వేసి తక్కువ మంట మీద నెమ్మదిగా కలుపుతూ ఉండాలి.

77

క్రీమ్ బాగా కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకొన్న కేకును తీసుకుని కేక్ పైభాగాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. దీనిపై చాక్లెట్ ద్రవాన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత బాదం పలుకులతో గార్నిష్ (Garnish) చేసుకుంటే హెల్తీ రాగి చాక్లెట్ కేక్ రెడీ (Ready).

click me!

Recommended Stories