contraceptive pills : ప్రస్తుత రోజుల్లో గర్భనిరోధక మాత్రల వాడకం బాగా పెరిగింది. ఈ మాత్రలను ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉపయోగిస్తున్నారట. అయితే ఈ మాత్రల వల్ల కలిగే లాభాల సంగతి పక్కన పెడితే.. వీటి వాడకం వల్ల ఎన్నో నష్టాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రలను ఉపయోగించడం వల్ల శరీరకంగానే కాదు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ముఖ్యంగా హార్మోన్ అసమతుల్యత సమస్య వస్తుందని పేర్కొంటున్నారు.
ethinyl estradiol, Synthetic estrogen, progesterone లు గర్బనిరోధక మాత్రల్లో ఉంటాయట. ముఖ్యంగా ఈ మాత్రల్లో ఉండే ethinyl estradiol వల్ల పిండం పెరగదు. అంతేకాదు ఈ టాబ్లెట్ల వాడకం వల్ల పీరియడ్స్ సమయంలో రక్తస్రావం అధికంగా కాకుండా చేస్తుంది. కానీ ఈ మాత్రల వల్ల కలిగే నష్టాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
గర్భనిరోధక మాత్రలను 1960 లో ప్రవేశపెట్టారు. వీటి వాడటం వల్ల గర్భం దాల్చకపోవడం వల్ల తమ నియంత్రణలో ఉంటుందని భావిస్తున్నారు. కానీ వీటిని తరచుగా వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను గుర్తించలేకపోతున్నారు. కొన్ని నివేధకల ప్రకారం.. ఇండియాలో ఏడాదికి 1.5 కోట్ల మందికి కంటే ఎక్కువ ఆడవారు గర్భస్రావాల బారిన పడుతున్నారట. కాగా వీళ్లల్లో 75 శాతం ఆడవారు డాక్టర్లను consultent చేయకుండానే గర్భనిరోధక మాత్రలను వాడుతున్నారట.
అధ్యయనాల ప్రకారం.. గర్భనిరోధక మాత్రలను వాడటం వల్ల వాంతులు, తీవ్రమైన తలనొప్పి, వికారం, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు తేలింది. అంతేకాదు నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అయ్యే ప్రమాదముందట. అలాగే ఈ నెలసరి సమయం పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
25 నుంచి 45 లోపు వయసున్న వారు ఈ గర్భనిరోధక మాత్రలను వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కౌమార దశలో వీటిని తరచుగా వాడితే వారి Reproductive system పై చెడు ప్రభావం పడుతుందట. అంతేకాదు Hormone levels ఉండని ఆడవారు గర్భనిరోధక టాబ్లెట్లను తీసుకుంటే చాలా ప్రమాదమని చెబుతున్నారు. ఈ మాత్రల వల్ల కొంత మంది ఆడవారు బరువు పెరుగుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
మధుమేహం, ఊబకాయం సమస్యలున్న వారు ఈ మాత్రలను వాడకూడదు. అలాగే స్మోకింగ్ చేసే ఆడవారు గర్భనిరోధక టాబ్లెట్లను వేసుకోవడం అంతగా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గుండెకు సంబంధిత రోగాలు, అధిక రక్తపోటు సమస్యలున్న వారు కూడా వీటిని వాడకూడదు.
మీకు తెలుసా ఈ గర్భనిరోధక మాత్రలను 10 సంవత్సరాలకు పైనే తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 60 శాతం ఎక్కువుగా పెరుగుతుందట. కాగా ఫ్యామిలీలో ఎవరికైనా బ్లడ్ గడ్డకట్టిన వాళ్లుంటే ఆఫ్యామిలీలోని ఆడవారు ఈ మాత్రలను తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భనిరోధక మాత్రలను ఉపయోగించాలనుకుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యుడు సూచించిన మాదిరిగా ఉపయోగిస్తే ఎలాంటి అనర్థాలు జరగవు.