వృద్ధాప్యం వల్ల ఒంట్లో సత్తువ తగ్గిపోతోందా? ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండాలంటే వీటిని తప్పక తినండి

First Published Oct 1, 2022, 11:11 AM IST

వయసు మీద పడుతున్న కొద్దీ ఒంట్లో సత్తువ తగ్గుతుంది. ఎందుకంటే ఈ వయసులో ఏదీ తినాలనిపించదు. తిన్నా సరిగ్గా అరగదు. అందుకే ఏది తినడానికి ఇష్టపడరు. 

వృద్ధాప్యం సహజ ప్రక్రియ. దాన్ని ఏం చేసినా ఆపలేం. ఈ వృద్ధాప్య ప్రక్రియ యుక్తవయసు నుంచే ప్రారంభమవుతుంది. దీనివల్ల శరీరంలోని జీవక్రియలో, శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. వయసు  మీద పడుతున్న కొద్దీ పోషకాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక వ్యక్తికి పోషకాల అవసరం వయసు, లింగం , బరువుపై ఆధారపడి ఉంటుంది. వృద్ధాప్య ప్రక్రియ మందగించడానికి శరీరంలో తగినంత పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వయసు మీద పడుతున్న వారిలో అజీర్థి, జీవక్రియ రేటే మందగించడం, ఆకలి లేకవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో శక్తి పెరగాలంటే ఏమేం తినాలో తెలుసుకుందాం పదండి. 

protein rich foods

మాంసకృత్తులు

నోటికి రుచిగా ఉండే ఆహారాలనే తినేవారు చాలా మందే ఉన్నారు. వీటి వల్ల శరీరం దెబ్బతినడమే కాకుండా ఎన్నో రోగాలు కూడా అంటుకుంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే ఎలాంటి రోగాలు సోకే ప్రమాదం ఉండదు. వయసు మీద పడుతున్న కొద్దీ జీవక్రియ రేటు మందిగించడంతో పాటుగా జీర్ణక్రియ సమస్యలు కూడా వస్తాయి. వీటివల్ల కూడా వీరిలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. అయితే రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచేందుకు ప్రోటీన్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇందుకోసం పెరుగు, విత్తనాలు, సీఫుడ్, పౌల్ట్రీ, గుడ్లు, సోయా, కాయధాన్యాలు, మజ్జిగ వంటివి తీసుకోండి.
 

నీరు

మలబద్దకాన్ని నివారించడానికి నీళ్లు చాలా అవసరం. ఎందుకంటే వృద్ధాప్యంలో శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో సూప్ లు, మజ్జిగ, నీరు వంటివి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది. రోజుకు కిలోకు 30 మి.లీ ద్రవం అవసరమవుతుంది. 
 

fiber

హై ఫైబర్ ఫుడ్స్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు మన శరీరానికి చాలా అవసరం. శరీరంలో మొత్తం 25 నుంచి 30 కిలో కేలరీల శక్తిలో 55 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్లు తీసుకోవాలని నిపుణులు చెబుతారు. తృణధాన్యాలు, ఓట్ మీల్, తియ్యని పాప్ కార్న్  మొదలైన వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినండి.  ప్రాసెస్ చేసిన, రిఫైన్ చేయబడ్డ తృణధాన్యాలను తీసుకోకండి. ఒక వ్యక్తికి రోజుకు 20 నుంచి 25 గ్రాముల ఫైబర్ అవసరమవుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఆకుకూరలు, తృణధాన్యాల్లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 

విటమిన్ ఎ, సి, డి-రిచ్ డైట్
 
విటమిన్ ఎ వంటి సూక్ష్మపోషకాలు, నీటిలో కరిగే విటమిన్ బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇవి గుడ్డులోని పచ్చసొన, లివర్ లో ఉంటాయి. 
 

vitamin d

విటమిన్ డి

విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్.  ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఎముక ఏర్పడటానికి కూడా ఉపయోగపడుతుంది. పాల ఉత్పత్తులు, చేపలు, తృణధాన్యాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. 

విటమిన్ సి

విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్. ఈ విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ సిట్రస్ పండ్లు, ఆకు కూరల్లో ఎక్కువగా ఉంటుంది.  కాల్షియం, ఐరన్, జింక్,  ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు ఎముకలను బలంగా ఉంచడానికి అవసరమవుతాయి. రక్తం గడ్డకట్టడానికి కాల్షియం చాలా అవసరమవుతుంది. పాలు, పాల ఉత్పత్తులు, ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, విత్తనాల్లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రక్త కణాలు ఏర్పడటానికి ఇనుము అవసరమవుతుంది. డ్రై ఫ్రూట్స్, పోహా, బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 

click me!