తిన్న తర్వాత ఈ తప్పులను అస్సలు చేయకండి.. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త..

First Published Aug 15, 2022, 12:54 PM IST

మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులైనా ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. అందుకే అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి.  
 

ఆహారమే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మనం తినే ఫుడ్ లో పోషకాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. మనం మంచి ఫుడ్ ను తీసుకుంటేనే మన  శరీరానికి శక్తి లభించి.. పనిచేయగలుతాం. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొంతమంది తిన్న తర్వాత చేయకూడని పనులను చేస్తుంటారు. దీనివల్ల వారి ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది. అందుకే తిన్న కొన్ని పనులను చేయకూడదు. అవేంటంటే.. 

ఆహారం తిన్న వెంటనే చాలా మంది బద్దకస్తులుగా మారిపోతారు. దీనికి కారణం తిన్న వెంటనే టీవీ చూడటమో.. మొబైల్ లో గడపడమో చేస్తుంటారు. లేదా హాయిగా పడుకోవడం లేదా కూర్చోవడమో లాంటివి చేస్తుంటారు. నిజానికి తిన్న తర్వాత 15 నిమిషాల పాటు ఇంట్లో చిన్న చిన్న పనులను చేయాలి. అప్పుడే మీరు హుషారుగా ఉంటారు. 

స్నానం

కొంతమంది తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది  జీర్ణక్రియను పాడు చేస్తుంది. ఒక వేళ తిన్న తర్వాత స్నానం చేయాల్సి వస్తే 2 గంటలు గ్యాప్ ఇచ్చి చేయండి.
 

నడక

తిన్న తర్వాత వంద అడుగులన్నా వేయాలని చాలా మంది చెప్తూ ఉంటారు. నిజానికి ఇది మంచి విషయమే కానీ.. తిన్న వెంటనే మాత్రం అస్సలు నడవకూడదు. తిన్న తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి నడవాలి. అదికూడా వంద అడుగులకు మించకూడదు. లేదంటే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. 

espressos

టీ, కాఫీ లు తాగడం

చాలా మందికి తిన్న వెంటనే టీ లేదా కాఫీని తాగే అలవాటు ఉంటుంది. ఇలా ఇలా భోజనం చేసిన వెంటనే టీ , కాఫీలను తాగడం వల్ల కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. గ్యాస్, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. ఒకవేళ తిన్న తర్వాత వీటిని తాగాలనుకుంటే కనీసం 1 నుంచి 2 గంటల తర్వాతే తాగండి. 
 

ఈ వస్తువులను తినడం మానుకోండి

ఫుడ్ ను తిన్న తర్వాత  శీతల పానీయాలు అసలే తాగకూడదు. ఇవి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. అలాగే ఆహారం తిన్న వెంటనే ఐస్ క్రీం లేదా ఏదైనా తీపి వంటకాన్ని కూడా తినకూడదు. అయితే కొంతమంది తిన్న వెంటనే స్మోకింగ్ చేస్తుంటారు. ఈ అలవాటు కూడా మంచిది కాదు. దీనివల్ల ఎన్నో ప్రాణాంతకమైన రోగాలొస్తాయి.

click me!