Control Blood Sugar Level: ఈ డ్రింక్స్ తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి..

First Published Aug 15, 2022, 11:59 AM IST

Control Blood Sugar Level: పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

ఈ రోజుల్లో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య ఈ రోజు రోజు రోజుకీ పెరిగిపోతోంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ అయ్యే పరిస్థితినే డయాబెటీస్ అంటారు. అయితే ఈ వ్యాధి బారిన పడ్డ వారు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి వీరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇందుకోసం రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా కొన్ని ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. 

షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ పడుకునే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బాదం పప్పులు

బాదం పప్పులో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం 2 నుంచి 3 బాదం పప్పులను చూర్ణం చేసి పాలలో వేసి మరిగించాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు తాగాలి. బాదం పాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
 

నల్లమిరియాలు

నల్ల మిరియాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని దగ్గు, జలుబును తగ్గించడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఇది ఆకలిని పెంచుతుంది కూడా. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇవి దివ్య ఔషదంలా పని చేస్తాయి. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు పాలలో మూడు లేదా నాలుగు మిరియాలను వేసి గ్రైండ్ వేయాలి. దీనికి అర టీస్పూన్ జీలకర్రను వేసి బాగా మరిగించి తాగాలి. ఈ పానీయం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

పసుపు

పసుపులో యాంటీ ఆక్సిండెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పసుపును ఎన్నో రోగాలకు నివారణగా ఉపయోగిస్తూ వస్తున్నారు. పసుపు షుగర్ పేషెంట్లకు కూడా మేలు చేస్తుంది. రాత్రి పడుకునే ముందు గ్లాస్ పాలలో పసుపు కలిపి తాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. 
 

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది జీవక్రియ ప్రక్రియలను నియంత్రించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఒక గ్లాసు పాలలో 2 నుంచి 3 దాల్చినచెక్కలను వేసి మరిగించాలి. పడుకునే ముందు ఈ పాలను తాగాలి.

click me!