Health Tips: వర్షాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచే పండ్లు ఇవి

Published : Jul 11, 2022, 04:53 PM IST

Health Tips: వర్షకాలంలో వేడి వేడిగా సమోసాలో, బజ్జీలో తినాలనిపించినప్పటికీ ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అదే పండ్లు అయితే మీ రోగ నిరోధశక్తిని పెంచడమే కాదు సీజనల్ అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతాయి. వానాకాలంలో ఎలాంటి పండ్లను తింటే ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
18
Health Tips: వర్షాకాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచే పండ్లు ఇవి

ఆపిల్ (Apple)

ఏడాది పాటూ ఈ పండు మనకు అందుబాటులోనే ఉంటుంది.  అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఈ పండును సీజన్ తో సంబంధం లేకుండా తినొచ్చు. ఎందుకంటే ఈ పండు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. కానీ ఈ పండును పగటిపూట మాత్రమే తినాలి. 
 

28

ఆలూ బుఖరా (Plum fruit)

వర్షాకాలంలో ఆలూ బుఖారా పండ్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఫైబర్, మినరల్స్, విటమిన్ సి తో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతో సహాయడుతుంది. అలాగే శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యకు కూడా సహాయపడుతుంది. 

38

దానిమ్మ (Pomegranate)
 
దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను బలోపేతం చేసేందుకు సహాయపడతాయి. అంతేకాదు శరీరంలో ఎర్రరక్తకణాలను కూడా పెంచుతుంది ఈ పండు. అందుకే ఈ పండున వర్షాకాలంలో తప్పని సరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

48

బీట్ రూట్ (Beet root)

బీట్ రూట్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ పండులాగే ఇది కూడా ఎర్ర రక్తకణాలను పెంచుతుంది. అలాగే అధిక బరువును కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 
 

58

నిమ్మకాయ (lemon)

నిమ్మకాయ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రోగనిరోశక శక్తిని పెంచడంతో పాటుగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఉదయం పూట గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగితే ఆరోగ్యం బాగుంటుంది. 
 

68

చెర్రీ (Cherry)

చెర్రీలల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి చెడు కొలెస్ట్రాల్ ను, అధిక రక్తపోటు ను నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడతాయి. 
 

78

జామున్ (Jamun)

ఈ సీజన్ లో నేరేడు పండ్లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వీటిని తింటే సీజనల్ రోగాలైన వైరల్ ఫీవర్, జర్వం, దగ్గు, జలుబు వంటి సమస్యలెన్నో తగ్గిపోతాయి. 

88

పీచెస్ (Peaches)

పీచెస్ లో ఫైబర్, విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పండులో కేలరీలు తక్కువ మొత్తంలో ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories