వీటిని ఎంతైనా తినండి.. కొంచెం కూడా బరువు పెరగరు తెలుసా..!

Published : Aug 16, 2022, 04:56 PM IST

చాలా మంది బరువు పెరిగిపోతామేమో అనే భయంతోనే సగం కడుపు మాడ్చుకుంటారు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ను ఫుల్ గా లాగించినా బరువు కొంచెం కూడా పెరగరు. ఇలాంటి వాటిని కడుపు నిండా తినొచ్చు. 

PREV
18
  వీటిని ఎంతైనా తినండి.. కొంచెం కూడా బరువు పెరగరు తెలుసా..!

ఈ రోజుల్లో అధిక బరువు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఇక ఏవి తింటే బరువు పెరిగిపోతామేమోనని చాలా మంది కడుపును మాడ్చుకుంటున్నారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం లేదు. పోషకాల లోపంతో ఎన్నో రకాల జబ్బులొస్తాయి.  ఇ సమస్యలన్నీ రాకూడదంటే హెల్తీగా ఉండే ఫుడ్స్ ను తినాలి. వీటిని కూడా పరిమితిగానే తినాలా? అని నిరాశ పడిపోయే వారు చాలా మందే ఉన్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలను కడుపు నిండా తినొచ్చు. మీకు తెలుసా.. వీటిని ఎంత తిన్నా బరువు అస్సలు పెరగరు. అంతేకాదు హెల్తీగా కూడా ఉంటారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. అవేంటంటే.. 

28

సీజనల్ ఫ్రూట్స్ (Seasonal fruits)

సీజనల్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. వీటిని ఎంత తిన్నా కొంచెమైనా బరువు పెరగరు. ఇవి మీ ఆరోగ్యానికి రక్షణ కవచంలా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో కేలరీలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వీటి ద్వారా మీ శరీరానికి కావాల్సిన సహజ చక్కెరలు లభిస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. అందుకే సీజనల్ పండ్లను తినడంలో మిస్ కాకండి. 
 

38

నట్స్

నట్స్ లో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలుంటాయి. వీటిని రోజూ కొద్ది మొత్తంలో తినడం వల్ల ఎన్నో రోగాలు పరారవుతాయి. అలాగే మీ శరీరం ఎనర్జిటిక్ గా కూడా ఉంటుంది. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇందుకోకు వేరు శెనగలు, బాదం పప్పు, పిస్తాలు, వాల్ నట్స్ న్ తింటూ తినాలి. రోజుకు రెండు పూటలా కొద్ది కొద్దిగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 

48

పెరుగు

చలికాలం, వానాకాలం వస్తే చాలు పెరుగును పక్కకు పెట్టేసేవారు చాలా మందే ఉన్నారు.  ఈ కాలాల్లో పెరుగు తింటే జలుబు అవుతుందని తినడానికి వెనకాడుతుంటారు. అయితే రోజుకు ఒక కప్పు మధ్యాహ్నం లేదా ఉదయం పూట తింటే ఎలాంటి సమస్యలు రావు. అయితే వెన్న తీసిన పెరుగును తింటే బరువు పెరిగే అవకాశమే ఉండదు. ఈ పెరుగుకు పండ్లను జోడించి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. 
 

58

ఓట్స్

ఓట్స్ లో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తొందరగా కడుపును ఫుల్ గా చేయడానికి సహాయపడతాయి. అంతేకాదు రక్తంలో షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉంచుతాయి. ఓట్స్ ఉప్మా లేదా ఓట్స్ లో పండ్లు, పాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆకలి కూడా తొందరగా అవదు. అందులో ఇవి మీరు ఫాస్ట్ గా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. 
 

68

పాప్ కార్న్

ఇంట్లో తయారుచేసిన పాప్ కార్న్ తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.  ఇది మీ బరువును కొంచెం కూడా పెంచదు. ఎందుకంటే దీనిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని ఎన్నైనా తినొచ్చు. 
 

78

చిక్పీస్

కొమ్ము వెనగలు రుచితో పాటుగా ఎన్నో  పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని ఎన్ని తిన్నా బరువు అస్సలు పెరగరు. వీటిని నీటిలో నానబెట్టి ఉప్పు, మిరియాల పొడి వేసి నూనెలో వేయిస్తే బలే టేస్టీగా ఉంటాయి. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. 
 

88

అవొకాడో

అవొకాడోల్లో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మన దేశంలో పండకపోయినా.. దిగుమతి అవుతాయి. ఏ మార్కెట్ లోకి వెళ్లినా ఇవి లభిస్తాయి. వీటిని డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. బరువును తగ్గించడంలో కూడా ఇవి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories