సన్నబడాలని తేనె, వేడినీటిని కలిపి తాగుతున్నారా? అయితే ఈ విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Published : Jul 05, 2022, 11:50 AM IST

Health Tips: మనం మంచి అనుకున్న కొన్ని రకాల ఆహారాలే మనకు ఎంతో హాని కలిగిస్తాయి. అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని  ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. 

PREV
17
సన్నబడాలని తేనె, వేడినీటిని కలిపి తాగుతున్నారా? అయితే ఈ విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

కోవిడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జనాలంతా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు సమతుల్య ఆహారాన్ని తింటున్నారు. అయితే కొన్ని సందర్బాల్లో ఆరోగ్యకరమైన ఆహారాలనే తీసుకున్నప్పటికీ అనారోగ్యం బారిన పడుతున్నారు. 

27

ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ఏమాత్రం తప్పు కాదు కానీ.. మనం ఆరోగ్యకరమైన కొన్ని రకాల ఆహారాలు మన హెల్త్ కు హానికరం కావొచ్చు. దీంతోనే అనారోగ్యం బారిన పడుతుంది. ఇప్పుడు చెప్పుకునే ఆహారాలు మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

37

పెరుగు (curd)

పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మన శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. కానీ ఈ వర్షాకాలంలో మాత్రం పెరుగును తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం.. ఈ సీజన్ లో పాలు, పెరుగును తీసుకోకపోవడమే మంచిది. మిగిలిన సీజన్ లలో దీన్ని ఎంత అయినా తినొచ్చు కానీ.. ఈ సీజన్ లో మాత్రం దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ పెరుగును తిన్నా ఆ తర్వాత ఎలాంటి పానీయాలను తాగకూకడదు. వేడినీల్లు లేదా వేడిగా ఉండే ఏదైన పానీయం కావొచ్చు. 
 

47

తేనె (honey)
 
తేనంటే ఇష్టపడని వారు ఉండరేమో. ఈ రోజుల్లో చాలా మంది ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగడం అలవాటు చేసుకున్నారు. వీటిని తాగితే బరువు తగ్గుతారని. ఈ నీళ్లు బరువు తగ్గే ప్రాసెస్ ను వేగంగా చేసినా.. తేనెను ఎప్పుడూ వేడినీటితో కలిపి తీసుకోకూడదు. తేనెను తీసుకున్నా వేడినీళ్లు మాత్రం తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

57

ఆల్కహాల్ (Alcohol)

ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. అయితే దీన్ని తాగే వారు మాత్రం బోలెడు మంది ఉన్నారు. ఈ ఆల్కహాల్ ను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. అదే పరిమితికి మించి తాగితేనే శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అయితే ఆల్కహాల్ ను తాగిన తర్వాత ఎలాంటి ఇతర పానీయాలను తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 

67

పెరుగును తీసుకున్న తర్వాత వేడి నీళ్లు లేదా ఇతర పానీయాలను తాగితే జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. 
 

77

తేనె తిన్న తర్వాత వేడినీళ్లనె తాగడం లేదా.. వేడి నీళ్లలో తేనెను వేసుకుని తాగడం వల్ల ఇది శరీరంలో స్లో పాయిజన్ గా పనిచేస్తుంది. ఇక ఆల్కహాల్ తాగిన తర్వాత ఏదైన వేడిగా ఉండే పానీయం తాగితే వాంతులు అవుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories