
ఈ రోజుల్లో డయాబెటీస్ వ్యాధి సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లలను నుంచి మొదలు పెడితే పెద్ద వయసు వారు వరకు దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ఒక సారి వచ్చిందంటే జీవిత కాలం మనతోనే ఉంటుంది. దీనిని పూర్తిగా తగ్గించుకోలేం. చేయాల్సిందల్లా దీన్ని నియంత్రణలో ఉంచుకోవడమే. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే వీరి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందుకే దీన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు వీరి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. అలాంటి వాటిని పూర్తిగా నివారించాలి. ముఖ్యంగా చక్కెర వీరి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అయితే పండ్లలో కూడా సహజ చక్కెర ఉంటుంది. ఇవి కూడా కృత్రిమ చక్కెర లాగే రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కృత్రిమ చక్కెరకు, సహజ చక్కెరకు ఉన్నా తేడా ఒక్కటే.. సహజ చక్కెరలు అంత హానికరం కాదు. అయినప్పటికీ వీటిని కూడా మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వ్యక్తకైనా యాంటీ ఆక్సిడెంట్లే, ఇతర పోషకాలు అవసరం. ఇవి పండ్లను నుంచి ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. అయితే కొన్ని రకాల పండ్లు డయాబెటీస్ ల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయడపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Peach
ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండును డయాబెటీస్ లు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా తినొచ్చు. దీనిలో పొటాషియం. విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాగా ఈ పండు రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఒకేసారి పెంచుతుంది. కాగా పీచెస్ లో ఉండే బయోయాక్టీవ్ కాంపౌండ్ మధుమహం వల్ల వచ్చే అారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఊబకాయులకు కూడా ఈ పండు మేలు చేస్తుంది. పీచెస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
జామున్ (Jamun)
డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచడానికి ఈ జామున్ ను దశాబ్దాల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఈ పండులో చక్కెర కంటెంట్ తక్కువ మొత్తంలో ఉంటుంది. మధుమేహులు ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పిండి పదార్థాలను శక్తిగా మార్చడానికి సహాయపడతాయి. అలాగే షుగర్ స్థాయిని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.
ఆపిల్ (Apple)
ఆపిల్ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో, ఫ్రక్టోజ్ తక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఈ పండు మలబద్దకాన్ని నివారించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. అంటే రక్తం రక్తప్రవాహంలోకే నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది అన్నమాట. అలాగే ఇది చక్కెర స్థాయిని నియంత్రణలోనే ఉంచుతుంది.
బొప్పాయి (papaya)
బొప్పాయి పండు కూడా చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. పలు నివేధిక ప్రకారం..ఈ పండులో ఉండే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాల నష్టాన్ని కూడా నివారిస్తాయి. అంతేకాదు మీరు ఆరోగ్యకరమైన బరువు ఉండేందుకు సహాయపడతాయి. ఈ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం, విటమిన్ బి, పొటాషియం, ఫోలేట్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
జామకాయలు (Guavas)
జామకాయలో పీచుపదార్థం ఎక్కువగా ఉండి కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి అరిగి కణాల ద్వారా చాలా నెమ్మదిగా శోషించబడతాయి. ఈ పండుకూడా రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచదు. ఈ పండులో నారింజ పండు కంటే 4 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. దీనిలో పొటాషియం ఎక్కువగా సోడియం తక్కువగా ఉంటుంది. ఈ పోషకాలు దీర్ఘకాలిక రోగాలను తగ్గించడంతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి.