గుడ్లను ఎక్కువగా తింటే ప్రమాదకరమైన రోగాలొస్తయ్.. జాగ్రత్త..

First Published Dec 17, 2022, 1:54 PM IST

ప్రపంచంలోని గల పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాల్లో గుడ్లు ఒకటి. అందుకే రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. అలా అని గుడ్లను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఉత్తమ వనరుల్లో గుడ్లు ఒకటి. గుడ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఉడకబెట్టి తిన్నా, ఎలా వండుకుని తిన్నా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అందుకే రోజూ  ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలి అంటుంటారు. రోజుకు రెండు గుడ్లను తింటే ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే మీరు తొందరగా బరువు తగ్గుతారు. గుడ్డు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లలో మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియం ఉంటుందన్న సంగతి మీకు తెలుసా. ఇది కోడి నుంచి వస్తుంది. ఒకవేళ మీరు గుడ్లను సరిగ్గా ఉడకబెట్టకపోయి.. సరిగ్గా వండకపోయిన ఈ సూక్ష్మక్రిములు మీ శరీరంలోకి వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అసలు గుడ్లను ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలొస్తాయంటే.. 

ఒక రోజు మనం తీసుకోవాల్సిన 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్లో సగానికి పైగా ఒకే గుడ్డులోనే ఉంటుంది. అందుకే రోజులో ఎక్కువ మొత్తంలో గుడ్లను తినకూడదు. ఒకవేళ తింటే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండె పోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

మీకు తెలుసా.. పచ్చసొన పూర్తిగా కొలెస్ట్రాల్ తో తయారవుతుంది. గుడ్డులోని తెల్లసొన పూర్తిగా ప్రోటీన్లతో తయారవుతుంది. అందుకే మీరు ఉడికించిన గుడ్లనే తిన్నప్పటికీ వాటిలో కొవ్వు స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే పచ్చసొనను తినడం అంత మంచిది కాదు. 
 

egg

ఒకవేళ మీరు ఎక్కువ గుడ్లను తింటే మీ జీర్ణవ్యవస్థ దెబ్బతినే ఛాన్స్ ఉంది. అలాగే తీవ్రమైన కడుపు నొప్పి కూడా రావొచ్చు. కొంతమంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అంటూ మూడు పూటలా గుడ్లను తింటుంటారు. దీనివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. ఫుడ్ అలెర్జీ లేదా గుడ్డు సున్నితత్వం ఉండి.. గుడ్లను ఎక్కువగా తింటే ఈ సమస్యలు ఎక్కువవుతాయి. 

మీరు రోజుకు ఎన్ని గుడ్లను తింటున్నారో లెక్కేసుకోవడం మంచిది. అలాగే వాటిని ఎలా చేసి తింటున్నారో కూడా చూడాలి. గుడ్లలో ఉండే అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ కంటెంట్ డయాబెటిస్, ప్రోస్టేట్, పెద్దప్రేగు, కొలొరెక్టల్ క్యాన్సర్ ల ప్రమాదాలతో పాటు గుండె ఆరోగ్యం దెబ్బతినడంతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.

గుండె సమస్యలు ఉన్నవారు.. గుడ్లు తినేటప్పుడు తక్కువ పచ్చసొన, ఎక్కువ తెల్లసొన తినడం మంచిది. దీనివల్ల గుండెకు ఎలాంటి హాని జరగదు. 
 

click me!