పైల్స్ లేదా అర్షమొలల గురించి తెలియని వారుండరు. ఎందుకంటే ఈ సమస్య చాలా మందికి ఉంది. ఈ సమస్య ఉందని చెప్పుకోలేని రోగం ఇది. కొంతమంది దీని నొప్పి గురించి చెప్తే నవ్వుతారని తమలో తామే నలిగిపోతుంటారు. కానీ ఈ సమస్య వల్ల సరిగా కూర్చోవడం, నడవడం, పడుకోవడానికి కూడా కష్టంగానే ఉంటుంది. అయితే పైల్స్ కు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ నొప్పి పైల్స్ కంటే ఎక్కువుంటుంది. అందులోనూ శస్త్ర చికిత్స చేయించుకున్నా పైల్స్ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందుకే చాలా మంది శస్త్ర చికిత్సను చేయించుకోరు. కానీ మనకున్న అలివాట్లు కొన్ని పైల్స్ బారిన పడేలా చేస్తాయి. అందులో ఒకటి టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చోవడం. ఇది సిల్లీగా అనిపించినా ముమ్మాటికీ నిజం అంటున్నారు నిపుణులు.
పైల్స్ అంటే ఏమిటీ?
హేమోరాయిడ్స్ లేదా సాధారణ పరిభాషలో పైల్స్ అంటారు. మీ పాయువు, దిగువ పురీషనాళంలో వెరికోస్ సిరల మాదిరిగానే వాపు సిరలు ఉంటాయి. హేమోరాయిడ్స్ (మొలలు) పురీషనాళం లోపల లేదా పాయువు చుట్టూ చర్మం కింద అభివృద్ధి చెందుతాయి. మల లేదా మూత్ర విసర్జన సమయంలో ఒత్తిడి చేస్తే బయటకు కూడా వస్తాయి. కొన్నిసార్లు మొలల నుంచి రక్తం కూడా వస్తుంది.
మీరు టాయిలెట్ లో 10 నిమిషాల కంటే సమయంలో ఉన్నట్టైతే మీకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కమోడ్ మీద ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులకు హేమోరాయిడ్స్ ఉండవచ్చు. ఎందుకంటే మీరు కమోడ్ మీద ఎక్కువసేపు కూర్చుంటే.. మీ బట్ (పిరుదుల) చుట్టూ ఒత్తిడి ఎక్కువ పడుతుంది. దీని వల్ల పురీషనాళ సిరల్లో ఎక్కువ రక్తం పేరుకుపోతుంది. ఇది పైల్స్ కు దారితీస్తుంది. అందుకే టాయిలెట్ లో 10 నిమిషాలకు మించి ఎక్కువ సేపు కూర్చోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు టాయిలెట్ నుంచి త్వరగా బయటకు రావాలి. దీనితో పాటుగా టాయిలెట్ కు వెళ్లినప్పుడు ఎక్కువ ఒత్తిడి చేయడం వల్ల రక్తనాళాల్లో వాపు, హేమోరాయిడ్స్ (మొలలు) ఏర్పడతాయి.
piles
హేమోరాయిడ్స్ లక్షణాలు
చాలా సందర్భాల్లో అర్షమొలల లక్షణాలు తీవ్రంగా ఉండవు. వాటంతట అవే నయం అవుతాయి. కానీ ఈ సమస్య ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.
పాయువు చుట్టూ దురద, అసౌకర్యం
మలంలో రక్తస్రావం
మలం దగ్గర గాయాలు ఏర్పడతాయి
మొలలు మలవిసర్జన సమయంలో బయటకు వస్తాయి. నొప్పి కూడా విపరీతంగా ఉంటుంది.
ఈ సమస్య ఎక్కువైతే నిల్చోలేరు, కూర్చోలేరు.