ఈ మధ్యకాలంలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాల లోపం, వేయించిన ఆహారాలు, కొన్ని ఔషధాలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి మరింత ఎక్కువవుతుంది. డయాబెటీస్ వల్ల నరాలు, కళ్లు, మూత్రపిండాలు, ఇతర అవయవాలు దెబ్బతింటాయి. అందుకే ఇది ప్రమారకరమైన వ్యాధి. వన్స్ ఇది ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మీతోనే ఉంటుంది. మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలన్నీ మిమ్మల్ని జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మధుమేహుల శరీరంలో ఇన్సులిన్ సరైన మొత్తంలో ఉత్పత్తి కాదు. దీనివల్లే ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే కొన్ని రకాల కూరగాయలను, ఇతర ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. అవేంటంటే..
పుట్ట గొడుగులు
డయాబెటిస్ పేషెంట్లకు పుట్టగొడుగులు ఎంతో మంచివి. ఇవి డయాబెటీస్ లక్షణాలను తగ్గిస్తాయి. పుట్టగొడుగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే ఇవి మధుమేహులకు సురక్షితమైన ఫుడ్ అంటారు. ఈ పుట్టగొడుగులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. బదులుగా దీనిలో ఉన్న విటమిన్ బి కంటెంట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ విటమిన్ బి ఇన్సులిన్ స్థాయిలను మెరుగ్గా ఉంచడంతో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. పుట్టగొడుగులు రక్తంలో గ్లూకోజ్ ను బాగా శోషించుకోవడానికి కూడా సహాయపడతాయి.
చిలగడదుంపలు
మధుమేహుల ఆరోగ్యానికి చిలగడదుంపలు ప్రయోజనకరంగా ఉంటాయి. రోజూ అరకప్పు చిలగడదుంపలను తినడం వల్ల మధుమేహు ఆరోగ్యం బాగుంటుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేకాక దీనిలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయడానికి, శరీరమంతా పోషకాలను రవాణా చేయడానికి సహాయపడతాయి. దీనిలో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడుతుంది. చిలగడదుంపలలో బీటా కెరోటిన్ అని పిలువబడే కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది విటమిన్ ఎ మూలం.
తులసి
తులసి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచే ఎన్నో పదార్థాలుంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న మధుమేహులకు ఎన్నో రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని తప్పించడానికి తులసిని ఉపయోగించవచ్చు. తులసిని తీసుకోవడం వల్ల క్లోమం బీటా-సెల్ పనితీరు మెరుగుపడుతుంది. ఇది కండరాల కణాలలో గ్లూకోజ్ శోషణకు కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ 3 గ్రాముల ఎండిన తులసి ఆకుల పొడిని ఖాళీ కడుపున తాగితే మంచిది. తులసి ఆకులను ప్రతిరోజూ నమిలినా లేదా నీటిలో మరగబెట్టి.. ఆ నీటిని తాగినా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
గుమ్మడి
గుమ్మడి కాయ విత్తనాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందది. ఈ గింజలు మధుమేహులకు చాలా మంచివి. దీనిలో ఉండే ఫైబర్ షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుమ్మడి గింజల్లో ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వును అందిస్తాయి. గుమ్మడికాయను మితంగా తీసుకుంటే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మొత్తం మీద గుమ్మడి గింజలు మన గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు ను నియంత్రణలో కూడా ఉంచుతాయని నిరూపించబడింది.
garlic
వెల్లుల్లి
మధుమేహులకు వెల్లుల్లి ఔషదంతో సమానం. దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలుంటాయి. వెల్లుల్లి మధుమేహాన్ని కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో పుష్కలంగా ఉండే విటమిన్ బి6 కార్బోహైడ్రేట్ల జీవక్రియను నియంత్రిస్తుంది.