దాల్చిన చెక్కతో బోలెడు లాభాలు.. దీన్ని ఎలా తినాలంటే?

First Published Feb 3, 2023, 4:30 PM IST

మన జీవక్రియ చురుగ్గా లేకుంటే ఎన్నో రోగాలొస్తాయి. మీకు తెలుగు దాల్చిన చెక్క జీవక్రియను పెంచుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. మరి ఇందుకోసం దాల్చిన చెక్కను ఎలా తినాలో తెలుసా? 

దాల్చినచెక్క తియ్యగా ఉంటుంది. కానీ దీన్ని మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గానికి దాల్చిన చెక్క టీని బాగా ఉపయోగిస్తున్నారు. కానీ ఇది జీవక్రియను కూడా వేగవంతం చేస్తుందన్న సంగతి మీకు తెలుసా? మెటబాలిజం కార్యకలాపాలు వేగవంతమైతేనే ఎన్నో రోగాలు మన శరీరానికి దూరంగా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ సమస్యలు. మన రోజువారీ ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చడం వల్ల కండరాల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. 

జర్నల్ హెల్త్ అండ్ డిసీజ్ భారతీయుల జీవక్రియ, జీవక్రియ సిండ్రోమ్ పై దాల్చినచెక్క ప్రభావాన్ని అధ్యయనం చేసింది. దక్షిణాసియాలో టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య, హృదయ సంబంధ వ్యాధుల వ్యాప్తి వేగంగా పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు.

గత మూడు దశాబ్దాల్లో భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ రోగుల సంఖ్య రెట్టింపు అయిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలా ఇంత వేగంగా ఈ సంఖ్య పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ ఎక్కువగా అసమతుల్య ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వల్లే డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు చాలా మంది భారతీయులు అధిక శరీర కొవ్వు, ఎక్టోపిక్ కొవ్వు (ఊబకాయం) ను కలిగి ఉన్నారు. ఇవి ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు. ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వస్తాయి. అయితే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యలను దాల్చిన చెక్క బాగా తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. 

మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను మెరుగుపరుస్తుంది

రక్తపోటు, మొత్తం సీరం కొలెస్ట్రాల్, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్, సీరం ట్రైగ్లిజరైడ్స్, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్లో సమతుల్యతను దాల్చిన చెక్క మెరుగుపరుస్తుందని నిపుణులు కనుగొన్నారు. దాల్చినచెక్క తీసుకోవడం జీవక్రియ సిండ్రోమ్ అన్ని భాగాలలో గణనీయమైన మెరుగుదలలకు దారితీసిందని పరిశోధకులు నిర్ధారించారు.
 

జర్నల్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన పరిశోధన వ్యాసాలు.. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల కలిగే ఊబకాయాన్ని తగ్గించడానికి దాల్చిన చెక్క ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని సూచిస్తున్నాయి. ఇది ఊబకాయం నిర్వహణలో బరువు తగ్గించే సప్లిమెంట్ గా సిఫారసు చేయొచ్చు.
 

Image: Getty Images

ఎప్పుడు తినాలి

జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్ ప్రకారం.. దాల్చినచెక్కను అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచిది. బ్రేక్ ఫాస్ట్ కు ముందు దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల మెటబాలిజం వేగవంతమవుతుంది. ఈ సమయంలో మీ శరీరం కొవ్వును కరిగించడానికి సిద్ధంగా ఉంటుంది. దాల్చిన చెక్కలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి.

cinnamon

దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి.  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ శరీరం కొవ్వును మరింత సమర్థవంతంగా కరిగించడానికి సహాయపడతాయి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది ఆహార కోరికలను కూడా తొలగిస్తుంది.

cinnamon

ఎలా తినాలి

దాల్చిన చెక్కను ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని 1 గ్లాసు నీటిలో కలిపి ఉదయం పరగడుపున తాగొచ్చు. ఇందుకోసం దాల్చిన చెక్కను రాత్రిపూట నీటిలో వేసి .. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. దాల్చిన చెక్క టీ తాగితే మెటబాలిక్ సిండ్రోమ్ ను అధిగమించొచ్చు. డయాబెటిస్ లేకపోతే ఒక అంగుళం దాల్చిన చెక్కను ఉడికించి నిమ్మరసం, తేనె, నల్ల మిరియాలు, యాలకులు, పుదీనా పొడి కలిపి తాగాలి. వీటన్నింటితో పాటు దాల్చినచెక్క క్యాప్సూల్ రూపంలో కూడా లభిస్తుంది. కానీ డాక్టర్ ను సంప్రదించకుండా దీన్ని తీసుకోకూడదు.

click me!