చాలా మంది ఇష్టంగా తినే ఆహారాలో పెరుగు ఒకటి. నిజానికి పెరుగు రుచికరంగా ఉండటమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. పెరుగు పోషకాలు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తి. పెరుగులో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పెరుగు వాయువు, మంట, ఆమ్లతను తగ్గిస్తుంది. పెరుగును ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అంటూ మూడు పూటలా తినొచ్చు.