Health Tips: వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఎంత మంచిదో తెలుసా..?

Published : Jul 16, 2022, 03:52 PM IST

Health Tips: మొక్కజొన్నలో ఉండే పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. అలాగే రక్తహీనత లోపాన్ని కూడా పోగొడుతాయి. 

PREV
18
Health Tips: వర్షాకాలంలో మొక్కజొన్న తింటే ఎంత మంచిదో తెలుసా..?

ఇతర సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలోనే ప్రమాదకరమైన రోగాలు సోకే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ సీజన్ లో పుష్కలంగా లభించే మొక్కజొన్నలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొక్క జొన్నన్ను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిని సలాడ్ రూపంలో లేదా కూరగా చేసుకుని లేదా కాల్చి తినొచ్చు. 

28

మొక్కజొన్నలో విటమిన్ బి 5, విటమిన్ బి6, జింక్, మాంగనీస్, ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంతో పాటుగా.. శరీరంలో రక్తహీనత సమస్యను కూడా పోగొడుతాయి. మొక్కజొన్నను తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

38

గుండెకు, ఎముకలకు ప్రయోజనకరంగా ఉంటుంది

మొక్కజొన్నలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అలాగే గుండెను ఫిట్ గా , ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతుంది. అంతేకాదు అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది.
 

48

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది

మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫెరులిక్ ఆమ్లం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

58

బరువును తగ్గిస్తుంది

మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే ఆకలిని కూడా నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి ఫాస్ట్ గా బరువు తగ్గాలనుకునే వారికి మొక్కజొన్న బెస్ట్ ఫుడ్. దీన్ని తింటే ఎంతో హెల్తీగా ఉంటారు. 
 

68

రక్తహీనత తగ్గుతుంది

మొక్కజొన్నలో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజాలు, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. ఇది కొత్త రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. 

78

నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది

మొక్కజొన్నను తినడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనిలో ఉండే ఆమైనో ఆమ్లాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఇవి మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి. 
 

88

వృద్ధాప్యాన్ని నివారిస్తుంది

మొక్కజొన్నలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి  శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి ముఖంపై ఉండే ముడతలను పోగొడుతాయి. 

  

Read more Photos on
click me!

Recommended Stories