తంగేడు పువ్వులు, ఆకులు, బెరడు, వేర్లు ఇలా ఈ మొక్క అన్ని భాగాలు అద్భుతమైన ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి ఉంటాయి. అందుకే పూర్వం నుంచి ఈ మొక్కను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు వేర్లతో తయారు చేసుకునే కషాయాలు అనేక అనారోగ్య సమస్యలను (Health problems) తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.