Gas Forming Foods: ఈ ఆహార పదార్థాలే కడుపులో గ్యాస్ ఏర్పడేలా చేస్తాయి.. వీటికి కాస్త దూరంగా ఉండండి..

First Published Jul 30, 2022, 2:50 PM IST

Gas Forming Foods: మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలే గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు కారణమవుతాయి. అందుకే వీటిని తినకపోవడమే మంచిది.
 

ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇవి చిన్న చిన్నగా ప్రారంభమై.. చివరకు ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా దెబ్బతీస్తాయి. అందుకే ఈ సమస్యలను అంత తేలిగ్గా తీసిపారేయకూడదు. 

అసలు కడుపులో గ్యాస్ ఎందుకు విడుదలవుతుంది..? దీనికి కారణనాలంటే? ఎలాంటి ఆహారాలను తినాలి.. వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


కడుపులో గ్యాస్ ప్రాబ్లం వివిధ కారణాల వల్ల వస్తుంది. ఎక్కువ రోజులు తినకపోవడం, ఒత్తిడి, మసాలా ఆహారాన్ని అతిగా తినడం, టెన్షన్, ఆందోళన వంటి కారణాల వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. 

Acidity

అయితే మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కడుపులో గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. వేయించిన ఆహారపదార్థాల నుంచి మొదలు పెడితే పాల వరకు ప్రతీది గ్యాస్ ను పుట్టిస్తాయి. కొన్ని రకాల కూరగాయలు కూడా కడుపులో గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. అవేంటంటే.. 

వేయించిన ఆహారాలు లేదా నూనెలో వేయించిన ఆహార పదార్థాలే గ్యాస్ కు కారణమయ్యే ఆహారాల్లో ముందుంటాయి. అందుకే వీటిని పరిమితికి మించి తినకూడదు. 

క్యాబేజీ, వంకాయ, కాలీఫ్లవర్, దోసకాయ,  పప్పు ధాన్యాలు, గోబి, జాక్ ఫ్రూట్, వైట్ చిక్పీస్, పచ్చి బఠానీలు, ముల్లంగి వంటి కూరగాయలు కడుపులో గ్యాస్ ను పుట్టిస్తాయి. అందుకే వీటిని తరచుగా తినకూడదు. 
 

ఈ కూరగాయలతో పాటుగా ఇంకొన్ని ఆహారాలు కూడా వాయువును తయారుచేస్తాయి. పాలు, మైదా, ఈస్ట్, సోయాబీన్స్,  వైట్ గ్రామ్, రాజ్మా, నట్స్, పేస్ట్రీలు స్నాక్స్ కూడా కడుపులో వాయువును పుట్టిస్తాయి. 
 

కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల ఆహారాలను కూడా తినలేరు. అయితే ఈ ఆహారాల వల్ల ప్రతి ఒక్కరికీ గ్యాస్ ఏర్పడదు. కొందరిలో మాత్రమే ఏర్పడుతుంది. 

వీటితో పాటుగా ఆల్కహాల్ కూడా కడుపులో గ్యాస్ ను తయారుచేస్తుంది. అందుకే బీర్ లేదా ఇతర ఆల్కహాల్ పానీయాలను ఎక్కువగా తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. 

click me!