ఈ ఆహారాలు రక్తపోటును తగ్గించమే కాదు.. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి

First Published Oct 23, 2022, 2:10 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మానసిక ఒత్తిడి, మద్యపానం, ఊబకాయం, ఉప్పు, స్మోకింగ్ రక్తపోటును అమాంతం పెంచేస్తాయి. రక్తపోటు పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలొచ్చే అవకాశం ఉంది. 
 

బిజీ లైఫ్ కారణంగా చాలా మంది తమ ఆరోగ్యం గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు. ఫలితంగా ఎంతో మంది సైలెంట్ కిల్లర్ రక్తపోటు బారిన పడుతున్నారు. ఈ రక్తపోటును సకాలంలో గుర్తించకపోతే ప్రమాణాలకే ప్రమాదం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఆల్కహాల్, మానసిక ఒత్తిడి, అధిక ఉప్పు, ఊబకాయం, ధూమపానం రక్తపోటును పెంచుతాయి. ఈ రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి అనేక ప్రాణాంతక రోగాలొచ్చే అవకాశం ఉంది.  అయితే ఆహారాలు రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో చూద్దాం పదండి.. 
 

leafy vegetables

ఆకు కూరలు

ఆకు కూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని క్రమం తప్పకుండా తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలను పొందుతాయి. ఆకు కూరల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూర, బ్రోకలీలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

అవొకాడో

అవొకాడోల్లో పొటాషియం , ఫోలేట్ లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త పోటును తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి గుండెను రక్షిస్తాయి. 

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. రక్తనాళాలను విస్తరించే నైట్రిక్ ఆక్సైడ్ మొత్తాన్నిపెంచడానికి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది. రోజూ 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలను తింటే గుండెపై ఒత్తిడిని తగ్గుతుంది. 

అల్లం

అల్లం ఔషదం కంటే తక్కువేం కాదు. ప్రతిరోజూ కొద్దిగా అల్ల తిన్నా లేదా అల్లం టీ తాగినా.. మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

అరటిపండు

అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక మీడియం సైజు అరటి పండులో 422 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. పొటాషియం రక్తనాళాల గోడలో ఉద్రిక్తతను తగ్గిస్తుంది.

అవిసె గింజలు

అవిసె గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. ఈ గింజలు గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా సహాయపడుతాయి. అవిసె గింజలను రోజూ తింటే సులువుగా బరువు తగ్గుతారు. 

click me!