కీళ్ల నొప్పులు ఉన్నోళ్లు వీటిని అస్సలు తినకూడదు..

First Published Sep 24, 2022, 12:41 PM IST

ఒంట్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల కాళ్లు, చేతి కీళ్లలో నొప్పులు వస్తాయి. ఇలాంటి వారు కొన్ని రకాల ఆహారాలను తినడం మానేస్తే సమస్య వెంటనే తగ్గిపోతుంది. 
 

ప్రస్తుత కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ యూరిక్ యాసిడ్ మనం తినే అనారోగ్యకరమైన ఆహారాలు, చెడు జీవన శైలివల్ల శరీరంలో పెరిగిపోతుంది. మోతాదుకు మించి శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు, కాళ్లు, చేతుల వాపు, మూత్రపిండాల్లో రాళ్లు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 

యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఈ యూరిక్ యాసిడ్.. ప్యూరిన్ విచ్చిన్నం అయినప్పుడు ఏర్పడుతుంది. ప్యూరిన్ మనం తినే ఆహారాల్లో  ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ మూత్ర విసర్జన ద్వారా బయటకు వెళుతుంది. ఒక వేళ మూత్రవిసర్జన సరిగా చేయకపోతే.. ఇది రక్తంలో అలాగే ఉండిపోతుంది. ఇక ఇది శరీరంలో పెరిగిపోయి కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటంటే.. 

చేపలు, చికెన్, మటన్, ఫౌల్ట్రీ, రెడ్ మీట్, చిక్కుళ్లు వంటి ఆహారాల జోలికి వెళ్లకపోవమే మంచిది. ఎందుకంటే వీటిలో ప్యూరిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని గనుక మీరు తినడం మానేస్తే.. కీళ్ల నొప్పులు, కిడ్నీల సమస్యలు, చేతుల వాపు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

శరీరంలో యూరిక్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది. తేనె, తియ్యగా ఉండే కొన్ని రకాల పండ్లను తింటే యూరిక్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అందుకే వీటికి కూడా కాస్త దూరంగానే ఉండండి. 

నీళ్లను ఎక్కువగా తాగండి

యూరిక్ యాసిడి లెవెల్స్ తగ్గాలంటే నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. అప్పుడే మూత్రం తరచుగా వచ్చి.. యూరిక్ యాసిడ్లు తగ్గుతాయి. అంతేకాదు మీరు తిన్న ఆహారం కూడా త్వరగా అరుగుతుంది. జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపడుతుంది. 
 

యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు ఆల్కహాల్ ను తాగడం మానుకోవాలి. ఎందుకంటే ఆల్కహాల్ ను తాగడం వల్ల బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల శరీరంలో విషాలు అలాగే పేరుకుపోతాయి. 
 

కాఫీ

కాఫీ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఇప్పటికే ఎన్నో అధ్యనాలు నిరూపించాయి. అందులోనూ యూరిక్ యాసిడ్ తో బాధపడేవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతాయి. అందుకే దీన్ని మోతాదులోనే తాగండి. 
 

click me!