వానాకాలంలో ఆరోగ్యం బాగుండాలంటే.. వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి..

First Published Aug 7, 2022, 1:16 PM IST

Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో. ఎందుకంటే మనం తినే ఫుడ్ తోనే ఎన్నో రకాల రోగాలొచ్చే ప్రమాదముంది. 
 

వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయాలంటే.. ముందు మీ ఆరోగ్యం బాగుండాలి. అందుకే మీరు తినే ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వానాకాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో ఎన్నో రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ఇలా జరగకూడదంటే రోగ నిరోధకతను పెంచే ఆహారాలను తినాల్సి ఉంటుంది. అంతేకాదు వంట చేసే టప్పుడు కూడా కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

 చేతులను శుభ్రంగా కడుక్కోవాలి

మార్కెట్ నుంచి కూరగాయలను, పండ్లను తెచ్చిన తర్వాత వాటిని నీట్ గా కడగడంతో పాటుగా మీ చేతులను కూడా శానీటైజ్ చేసుకోవాలి. అంతేకాదు వంట చేయడానికి ముందు, వంట చేసేటప్పుడు, చేసిన తర్వాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. తినడానికి ముందు కూడా చేతులను ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎందుకంటే బ్యాక్టీరియా అన్ని ప్లేసెస్ లో జీవించగలదు. అందుకే ముడి లేదా వండిన ఆహారాన్ని ముట్టుకున్న తర్వాత.. పాత్రలను క్లీన్ చేసుకోవాలి. 
 

వెజ్, నాన్ వెజ్ ను వేరుగా ఉంచండి

వండని మాంసం, సీ ఫుడ్స్, చికెన్, గుడ్ల వంటి ఆహారాలను  ఇతర ఆహారాల నుంచి వేరుగా పెట్టండి. ఎందుకంటే ముడి ఆహారాలకున్న సూక్ష్మజీవులు ఇతర ఆహారాలు సులువుగా వ్యాపిస్తాయి. అందుకే వాటిని కొన్నప్పుడు వాటిని ఒక కవర్ లోనే విడిగా పెట్టండి. వాటిని నిల్వ చేయాలనుకుంటే రిఫ్రిజిరేటర్ లో పెట్టండి. వాటిని కట్ చేయడానికి ప్రత్యేక బోర్డును ఉపయోగించండి. వండటానికి కూడా వేరే కంటైనర్ ను యూజ్ చేయండి. 

ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద వండాలి

 ఆహారం లోపలుండే సూక్ష్మజీవులను చంపడానికి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి. మాంసం సరిగ్గా ఉడికిందో లేదో తెలియకపోతే.. ఫుడ్ థర్మామీటర్ ను ఉపయోగించి తెలుసుకోండి. గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచిన ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అందుకే వండని, వండిన ఆహారాన్ని నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్లను ఉపయోగిస్తారు. రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 40°F లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఫ్రీజర్ ఉష్ణోగ్రత 0°F లేదా అంతకంటే తక్కువ ఉండాలి. వంట అయిన రెండు గంటల్లోగా రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ ను ఉంచాలి.
 

పాడైన ఫుడ్ ను తినొద్దు

వర్షాకాలంలో ఫుడ్ ను వేడి వేడిగానే తినాలి. ఎందుకంటే చల్లగా ఉండే ఆహారాల్లో బ్యాక్టీరియా నిల్వ ఉంటుంది. అందుకే వేడి వేడి టీ, సూప్, వేడి వేడి అన్నం, సాంబారు ను తీసుకోవడం అలవాటు చేసుకోండి. వర్షాకాలంలో ఫ్రిజ్ లో పెట్టిన ఆహారాన్ని వేడి చేసుకుని తినడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా సీ ఫుడ్, మాంసాహారాలను తినడం తగ్గించండి. పాశ్చ్యురైజ్డ్ పాలతో తయారు చేస్తే తప్ప జున్ను తీసుకోవడం మంచిది కాదు. 

click me!