అవిసె గింజలు బరువును తగ్గిస్తాయి.. కానీ రోజూ మాత్రం తినకూడదు.. ఎందుకంటే?

First Published Sep 19, 2022, 9:50 AM IST

బరువు తగ్గేందుకు అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 ప్రమాదాలను కూడా తగ్గించడానికి సహాయపడతాయి. అయినప్పటికీ వీటిని రోజూ తినడం అంత సేఫ్ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. అందుకే వీటిని రోజూ తినేవాళ్లు చాలా మందే ఉన్నారు. వీటిలో ఉండే ప్రోటీన్ జీవక్రియను నియంత్రిస్తుంది. దీంతె మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, లిగ్నాన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు కదలికను మెరుగుపరుస్తాయి. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ కూడా తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

బరువు తగ్గేందుకు అవిసె గింజలను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. ఇది ఎక్కువగా తినాలనే కోరికలను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో మీరు ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. 

అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అవిసె గింజలను మితంగానే తినాలని సిఫారసు చేస్తున్నారు. వీటిని పరిమితికి మించి తింటే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఈ విత్తనాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుందనే అభిప్రాయంతో తినేవారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

ముడి లేదా పండని విత్తనాలను అసలే తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇవి జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తాయి. అలాగే శరీరాన్ని దెబ్బతీసే విషాన్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. 
 

కాగా ఈ అవిసె గింజలను తినడం వల్ల వెన్నునొప్పి, పక్షవాతం, న్యూరల్జియా  వంటి వాత అసమతుల్యతలకు ఇవి ఉపయోగపడతాయి. అలాగే వీటిలో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది మలబద్దకాన్నిపోగొట్టడానికి కూడా సహాయపడుతుంది. 
 

అవిసె గింజలు సూపర్ ఫుడ్ కాదంటున్నారు కొందరు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే సూపర్ ఫుడ్ అంటే క్రమం అవిసె గింజలు శరీరంలో వేడిని కలిగిస్తాయి.ఈ వేడి వల్ల కఫా, పిత్త సమస్యలను తీవ్రతరం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించినప్పుడు ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే అవిసె గింజలను రోజూ తినకూడదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 
 

అయితే అవిసె గింజల్లో ఉండే పోషకాలను పొందడానికి ప్రత్యమ్నాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే నెయ్యిని అవిసె గింజలకు బదులుగా తీసుకోవచ్చని నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే నెయ్యి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. 

click me!