ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలిస్తే.. ఇంకెప్పుడూ దాని జోలికే వెళ్లరు తెలుసా..?

First Published Sep 18, 2022, 4:05 PM IST

ఫాస్ట్ ఫుడ్ తిన్నంత ఇష్టంగా మరేదాన్ని తినని వాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా ఫాస్ ఫుడ్ నే ఎక్కువగా తింటుంటారు. 
 

ఇంట్లో వండిన ఫుడ్ కు బయటవండిన ఫుడ్ కు చాలా తేడా ఉంటుంది. బయటి ఫుడ్ కాస్త రుచిగా ఉన్నా.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలొస్తాయి. మీకు తెలుసా ఫాస్ట్ ఫుడ్ స్పైసీగా, నాలుకకు రుచిగా అనిపించినా మన శరీరాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఎందుకంటే వీటిలో హానికరమైన కొవ్వులు, పిండి ఉంటాయి. లొట్టలేసుకుని తినే ఫాస్ట్ మన ఆరోగ్యానికి చేసే హాని  అంతా ఇంతా కాదు. పిల్లలు దీన్ని తినడం వల్ల కండరాల బలహీనత, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ , ఎముకల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసుకుందాం పదండి. 

తలనొప్పి

ఫాస్ట్ ఫుడ్ రుచికి పెద్దలే కాదు.. పిల్లలు కూడా బాగా అలవాటు పడిపోయారు. నిజానికి దీన్ని తరచుగా తినడం వల్ల తలనొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో సోడియం, లవణం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనివల్ల శరీరం దారుణంగా దెబ్బతింటుంది.

చర్మ సమస్యలు

ఫాస్ట్ ఫుడ్ తరచుగా తినడం వల్ల మొటిమలతో పాటుగా ఎన్నో రకాల చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే కార్భోహైడ్రేట్లు విరేచనాలను కలిగించడంతో పాటుగా.. మొటిమలకు కారణమవుతాయి.
 

పంటినొప్పి

ఫాస్ట్ ఫుడ్ ను తింటే కూడా పంటి నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నమ్మశక్యంగా లేకపోయినా.. ఈ విషయాన్ని నమ్మాల్సిందేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫాస్ట్ ఫుడ్ ను తరచుగా తినడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. అంటే దంతాల లైఫ్ టైం తగ్గుతుందన్న మాట. ఎందుకంటే ఈ ఫాస్ట్ లో ఎక్కువ మొత్తంలో ఉండే పిండి, చక్కెర లు యాసిడ్ ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో దంతాలు దెబ్బతింటాయి. 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఫాస్ట్ ఫుడ్ ను తింటే కూడా శ్వాస సంబంధిత సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ లో పోషకాలుండవు. దీన్ని తినడం వల్ల బాగా బరువు పెరిగిపోవడంతో పాటుగా శక్తిహీనంగా తయారవుతారు. దీనివల్ల మీరు ఎలాంటి పనులను చేయలేరు. ఈ కారణాలన్నింటి వల్ల శ్వాసలో ఇబ్బంది కలుగుతుంది. 

వీటితో పాటుగా క్రమం తప్పకుండా ఫాస్ట్ ఫుడ్ ను తింటే తినడం వల్ల గుండె రిస్క్ లో పడుతుంది. అంటే వీళ్లకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఇక ఈ  ఫాస్ట ఫుడ్ మీ శరీరంలో కొలెస్ట్రాల్ ను వేగంగా పెంచుతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు రక్తపోటు కూడా బాగా పెరుగుతుంది. అయితే ఒక్క ఫాస్ట్ ఫుడ్ ను తింటేనే బరువు పెరగరు. ఇతర ఆహారాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, వంశపారంపర్యంగా కూడా బరువు పెరిగిపోతారు. 

click me!