బరువు తగ్గాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే ..

First Published Sep 18, 2022, 4:58 PM IST

బరువు తగ్గాలంటే .. షుగర్ , కొవ్వులు, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే. అందులోనూ మీరు తినే ఆహారంలో కేలరీలు తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. 
 

బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గలేం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది. కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తీసుకోకూడదు. ఈ అలవాట్లు ఉంటేనే మీరు వేగంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా కార్భోహైడ్రేట్లు, చక్కెర, కొవ్వులు మీ బరువును అమాంతం పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే వీటికి కాస్త దూరంగానే ఉండాలి మరి. అలాగే కేలరీలు ఎక్కువుగా ఉండే ఆహారాలను కూడా తినకూడదు. బరువు తగ్గాలనుకునే వారు వేటిని తినకూడదో తెలుసుకుందాం పదండి. 
 

మటన్, గొడ్డు మాంసం

గొడ్డు మాంసం, మటన్ వంటి రెడ్ మీట్ లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. కానీ వీటిలో ప్రోటీన్లతో పాటుగా కేలరీలు, కొవ్వు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. ఇలాంటి వాటిని తరచుగా తినడం వల్ల శరీర బరువు అమాంతం పెరిగిపోతుంది. ఊబకాయం బారిన కూడా పడతారు. దీంతో అధిక రక్తపోటు, గుండె జబ్బులు కూడా, డయాబెటీస్ వంటి రోగాల ప్రమాదం పెరుగుతుంది. అందుకే వీటికి కాస్త దూరంగా ఉండండి. 
 

soft drinks

శీతల పానీయాలు

కృత్రిమ స్వీటెనర్లతో తయారైన శీతల పానీయాలు తాగే అలవాటుంటే వెంటనే మానుకోవడం బెటర్. ఎందుకంటే ఇవి మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే ఇవి బరువును అమాంతం పెంచుతాయి.  చక్కెర, సోడా అధికంగా ఉండే ఇలాంటి పానీయాలు శరీరంలో కేలరీలు పెరగడానికి దారితీస్తాయి. అందుకే ఇలాంటి పానీయాలకు దూరంగా ఉండండి. అప్పుడే బరువు తగ్గుతారు. 
 

చీజ్

జున్నును ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. కానీ దీనిలో కొలెస్ట్రాల్, కొవ్వు, సోడియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీన్ని తినడం వల్ల మీరు చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. అందుకే వీటిని ఎక్కువగా తినకండి.
 

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో కీలరీలతో పాటుగా కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఎక్కువగా తినకపోవడమే మంచిది. 

పిజ్జా 

లొట్టలేసుకుంటూ పిజ్జాలను లాగించేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిని ఎక్కువగా తినడం వల్ల మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఎందుకంటే పిజ్జాలో కార్బోహైడ్రేట్లు, ఉప్పు, సోడియం, చీజ్, టాపింగ్స్ లో ఉపయోగించే మాంసం మొదలైనవి ఉంటాయి. ఇవే బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి వీలైనంత వరకు పిజ్జా తీసుకోవడం తగ్గించండి.

click me!