Health Tips: చలికాలంలో తినాల్సిన పండ్లు ఏంటో తెలుసా?

Published : Jan 25, 2022, 10:49 AM IST

Health Tips:చలికాలంలో ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అందులోనూ సీజనల్ వ్యాదులైన జ్వరం, జలుబు, దగ్గు ఫ్లూ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సీజన్ లో లభించే కొన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి తింటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

PREV
15
Health Tips: చలికాలంలో తినాల్సిన పండ్లు ఏంటో తెలుసా?

Health Tips: అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించడంలో పండ్లు ముందుంటాయి. అందుకే సీజనల్ గా లభించే ఫ్రూట్స్ ను తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఈ పండ్ల ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. అయితే కొన్ని రకాల పండ్లు చలికాలంలో ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

25

ద్రాక్ష.. ఈ పండ్లు జనవరి నుంచే మార్కెట్లో అందుబాటులోకి వాస్తాయి.  కాగా ఈ పండులో విటమిన్ సి , విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ (Immunity) పవర్ ను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే గాయాలు త్వరగా నయం అయ్యేలా చేయడంతో పాటుగా ఎముకలు పటిష్టంగా ఉండేందుకు కూడా దోహదపడుతుంది. ఈ పండును అలాగే తిన్నా.. చక్కెరతో కలిపి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. 

35

దానిమ్మ.. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి కొన్ని రకాల క్యాన్లర్ల నివారణలో సహాయపడుతుంది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అందుకే ఈ సీజనల్ లో మీ రోజూ వారి ఆహారంలో ఈ దానిమ్మ పండ్లను చేర్చుకోండి. దానిమ్మ పండును గాని దాన్ని జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
 

45

పైనాపిల్.. పైనాపిల్ పండులో మాంగనీస్, విటమిన్ సి లు మెండుగా లభిస్తాయి. అంతేకాదు ఈ పండును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే ఎముకలు బలంగా, పటిష్టంగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడంలో ముందుంటుంది. మరీ ముఖ్యంగా సీజనల్ వ్యాదులను దూరం చేయడంలో ఈ పండు ఎంతో సహాయపడుతుంది. 
 

55

నారింజ.. ఈ పండు వింటర్ లో తీసుకోవాల్సిన పండు జాబితాలో లేకపోయినా.. ఈ పండును తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి. అలాగే అరటి కూడా ఎన్నో సమస్యలను దూరం చేయడంలో ముందుంటుంది. సీజన్లతో సంబంధం లేకుండా చౌకగా లభించే ఈ అరటిలో పొటాషియం మెండుగా లభిస్తుంది. ఇది Anxiety, stress సమస్యలను తగ్గిస్తుంది. అలాగే కణాలను బలోపేతం చేయడానికి కూడా ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories