వీటిని తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లను తాగకండి.. తాగారో మీ పని అంతే..

First Published Oct 4, 2022, 2:58 PM IST

తిన్నవెంటనే నీళ్లను తాగితే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అయితే కొన్ని రకాల ఆహారాలను తిన్న తర్వాత వెంటనే నీళ్లను తాగడం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు మూడు లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నీళ్లు మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.  మంచి ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. నీరు, ఇతర ద్రవాలు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. దీంతోనే శరీరం పోషకాలను గ్రహిస్తుంది. నీరు మలబద్దకాన్ని కూడా నివారిస్తుంది.
 

నీరు మన శరీరానికి అత్యంత ముఖ్యమైన అవసరం. అయితే నీటిని ఎప్పుడు తాగాలి.. ఎప్పుడు తాగకూడదు అన్న విషయాలను తెలుసుకోవడం కూడా ముఖ్యమే. కొంతమంది ఏది తిన్నా నీటిని పుష్కలంగా తాగుతుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. నీటిని తాగడానికి కొన్ని నియమాలున్నాయి. అవి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇకపోతే కొంతమంది హడావుడిగా నీళ్లను ఎక్కువగా తాగేస్తుంటారు. ఇలా కూడా తాగకూడదు.  ఎక్కువ మొత్తంలో నీళ్లను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

తిన్న వెంటనే నీళ్లను తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీనికి కారణం జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుందని అలా చెప్తారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తిన్న తర్వాత నీళ్లను అసలే తాగడకూడదు. ఒకవేళ తాగితే మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడుచేసుకున్న వారవుతారు. ఇంతకీ ఏవి తిన్న తర్వాత నీళ్లను తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జామకాయ 

జామకాయ టేస్టీగా ఉంటుంది. ఈ జామకాయలను ఎండాకాలం, శీతాకాలంలో  తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక దీనిపై ఉప్పు, మసాలా దినుసులు వేసి తింటే రుచి రెట్టింపు అవుతుందంటే నమ్మండి. కానీ ఇలా జామకాయను తిన్న వెంటనే నీళ్లు తాగాలనిపిస్తుంది. కానీ అలా అస్సలు తాగకూడదు. ఒక వేళ తాగితే జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీంతో గ్యాస్ సమస్యలు వస్తాయి.
 

వేయించిన చిక్పీస్

వేయించిన చిక్పీస్ తిన్న వెంటనే నీళ్లను తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒకవేళ తాగితే కడుపు నొప్పి వస్తుంది. చిక్పీస్ తిన్న తర్వాత నీళ్లు తాగితే చిక్పీస్ సరిగా జీర్ణం కాక.. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
 

ఐస్ క్రీం 

కాలాలతో సంబంధం లేకుండా ఐస్ క్రీం ను లాగించే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఐస్ క్రీం తిన్న తర్వాత పక్కాగా నీళ్లను తాగాలనిపిస్తుంది. కానీ ఐస్ క్రీం తిన్న వెంటనే నీళ్లను తాగితే గొంతు నొప్పి వస్తుందన్న ముచ్చట మీకు తెలుసా? ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నీళ్లను తాగితే దంత సమస్యలు కూడా వస్తాయి.

click me!