ఆవిరితో వండిన ఆహారాలతో ఆరోగ్యం బేష్..!

First Published Aug 22, 2022, 12:52 PM IST

ఆవిరితో తయారుచేసుకున్న ఫుడ్స్ లో కేలరీలు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి చాలా ఫాస్ట్ గా కూడా జీర్ణం అవుతాయి. ఈ ఫుడ్స్ ఒక్క బరువునేంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 

ఇడ్లీలు ఆవిరితోనే తయారైతాయన్న ముచ్చట అందరికీ తెలుసు. అయితే ఆవిరితో ఎన్నో రకాల వంటలను తయారుచేసుకుని తినొచ్చు. ఈ ఆవిరితో వండిన వంటలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఆవిరితో వండటం వల్ల వాటిలో ఉండే పోషకాలు ఎక్కడికీ పోవు. ఇక ఆవిరితో వండిన వంటల్లో నూనె కూడా తక్కువగా పడుతుంది. మీకో విషయం తెలుసా..? ఆవిరితో రెడీ చేసిన వంట్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇలాంటి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫుడ్ అనే చెప్పాలి. 
 

విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ చాలా మంది ఇలాంటి ఫుడ్స్ ను ఉడకబెట్టి వండుతారు. దీంతో వాటిలో ఉండే పోషకాలు చాలా తగ్గిపోతాయి. అదే వాటిని ఆవిరితో వండితే వాటిలో ఉండే ఖనిజాలు, పోషకాలు ఎటూ పోవు. ఆవిరిలో ఉడికించడం వల్ల నియాసిన్, విటమిన్ బి, థయామిన్, విటమిన్ సి వంటివి మన శక్తిని మరింత పెంచుతాయి. ఈ ఫుడ్స్ లో ఖనిజాలు, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, జింక్ వంటిపోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

సాధారణంగా ప్రతి వంటకు నూనెను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ ఆవిరితో తయారుచేసే ఆహారాలకు నూనె అవసరమే లేదు. అందుకే ఆవిరి పట్టిన ఆహారాల్లో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫుడ్ అని నిపుణులు చెబుతున్నారు. 

కూరగాయలు, పండ్లు తేలికగా జీర్ణం అవుతాయి. ఆవిరిలో వండిని ఆహారాలు చాలా మృదువుగా తయారవుతాయి. ఆవిరి పట్టిన ఆహారం చాలా ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ఫుడ్స్ తో మీ శరీరానికి అన్నో రకాల పోషకాలు అందుతాయి. 
 

కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది

స్టీమింగ్ విధానంలో ఉడికించిన ఆహారం కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. ఎందుకంటే ఈ వంటలో నూనెను ఉపయోగించకపోవడమే దీనికి కారణం. వంటల్లో నూనె వల్లే చాలా బరువు పెరుగుతారు. అందుకే ఎక్కువ కొవ్వు లేదా నూనె ను తినకూడదు. ఇది అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
 

ఆహారం రంగు, రుచి బాగుంటాయి..

ఆవిరితో వండిన కూరగాయల రంగు అస్సలు మారదు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవిరితో వండిన ఆహారాలను తినడం వల్ల వాటిలో ఉండే పూర్తి పోషకాలు అందుతాయి. అయితే ఆవిరితో వండిన వంటలు మరింత టేస్ట్ గా కావడానికి కొన్ని రకాల మసాలా దినుసులను కూడా ఉపయోగించొచ్చు. 

click me!