ప్రతిరోజూ తెల్లవారు జామున ఇలా చేస్తే ఎంత ఆరోగ్యమో తెలుసా?

First Published Sep 23, 2022, 2:30 PM IST

వ్యాయామాలు చేయడం వల్ల మన శరీరంలో ఎంతో ఫీట్ గా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండటానికి కూడా దోహదం చేస్తుంది. ఇలా వ్యాయామం చేయటం వల్ల మన మనసు ఎంతో ఉత్తేజితమవుతుంది.
 

exercise

ప్రస్తుతం ఉరుకులు పరుగులు పెడుతున్న ఈ కాలంతో పోటీగా యువతి యువకులు సంపాదనలో పడి వారి ఆరోగ్య విషయాన్ని పూర్తిగా పక్కన పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.అయితే కరోనా తరువాత ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే సరైన ఆరోగ్యం మనకు లభించాలంటే ప్రతి రోజు తెల్లవారుజామున ఈ చిన్న పనులు చేస్తే చాలు...

ఆరోగ్యం బాగుంటే ఎంత కష్టపడి అయినా డబ్బు సంపాదించుకోవచ్చు అలా కాకుండా డబ్బు కోసం రాత్రి పగలు కష్టపడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సంపాదించినది మొత్తం వైద్య ఖర్చులకే సరిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మనకు మంచి ఆరోగ్యం ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి. సరైన పోషకాహారంతో పాటు మన శరీరానికి తగిన వ్యాయామాలు చేయడం ఎంతో ముఖ్యం.
 

ఈ క్రమంలోనే మన శరీరం ఎంతో ఫిట్ గా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే తప్పనిసరిగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని, క్రమం తప్పకుండా ఆ ప్రణాళికను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఎంతో బద్ధకంగా నిద్రలేస్తారో. లేచిన అనంతరం కాసేపు ఎటు కదలకుండా ఒకే చోటు కూర్చొని సమయం వృధా చేస్తుంటారు. అలాగే మరికొందరు నిద్ర లేవగానే తమ రోజువారి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
 

అయితే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఇలా రోజు వారి పనులను చేస్తూ వెళ్లడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. మంచి ఆరోగ్యం ఉండాలని అనుకుంటారో అలాంటివారు ఉదయం నిద్ర లేవగానే శరీరానికి సరిపడా వ్యాయామాలు చేయడం ఎంతో మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా ప్రతిరోజు వ్యాయామలు చేయటం వల్ల మన శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పునరుద్ధరించుకుంటుంది.
 

ఇలా వ్యాయామాలు చేయడం వల్ల మన శరీరంలో ఎంతో ఫీట్ గా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉండటానికి కూడా దోహదం చేస్తుంది. ఇలా వ్యాయామం చేయటం వల్ల మన మనసు ఎంతో ఉత్తేజితమవుతుంది. ఇక నిద్రలేచిన వెంటనే రెండు చుక్కలు నువ్వుల నూనెతో తల బాగా మర్దన చేయడం ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఇలా వ్యాయామం అనంతరం దంతరక్షణ, స్నానం చేసిన తరువాత ఏది పడితే అది అల్పాహారంగా తినకుండా పోషక విలువలు కలిగినటువంటి అల్పాహారం తీసుకోవాలి.అలాగే రాత్రిపూట మితంగా ఆహారం తీసుకోవడం వల్ల ప్రశాంతమైన నిద్ర పట్టడమే కాకుండా ఎంతో ఆరోగ్యవంతంగా కూడా ఉండగలము.

click me!