వంటనూనెతో డయాబెటీస్ వస్తుందా?

Published : Dec 29, 2022, 04:02 PM IST

వంటనూనె వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. అయితే ఆహారంలో వంట నూనెను చేర్చడం వల్ల డయాబెటీస్ వస్తుందని చాలా మంది అనుకుంటారు. మరి దీనిలో నిజమెంతంటే..? 

PREV
18
 వంటనూనెతో డయాబెటీస్ వస్తుందా?

నిజానికి వంటనూనులన్నీ ఒకే విధంగా ఉండవు.  అంటే నూనె ఒక్కో నూనె ఒక్కోలా ఉంటుంది. పంది కొవ్వు వంటి జంతు మూలం నుంచి తయారుచేసే నూనెలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. వీటికి బదులుగా ఆలివ్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె లేదా నువ్వుల నూనెలను తీసుకోవాలి. ఇవి మన ఆరోగ్యాని చాలా మంచివి. వంట నూనెల్లో సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇవి డయాబెటిస్ తో సహా ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది.
 

28

కొన్ని రకాల నూనెలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే నూనె లేని ఆహారాలనే తినాలని ఎవరూ చెప్పరు. అయితే వంట నూనెలను కొనేటప్పుడు అవి ఆరోగ్యానికి మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అన్న సంగతిని తెలుసుకోవాలి. 
 

38

వంట నూనె మధుమేహానికి దారితీస్తుందా?

వంట నూనె మధుమేహానికి దారితీస్తుందనేది ఒక అపోహేనంటున్నారు నిపుణులు.  అయినప్పటికీ ఆరోగ్యకరమైన నూనెను వంటల్లో వాడుతూ.. జీవనశైలి సరిగ్గా లేకపోతే, శారీరక శ్రమ లేకపోతే  పక్కాగా డయాబెటీస్ వస్తుంది. 
 

48

మాంసాన్ని ఎక్కువగా తింటూ.. వ్యాయామం చేయకపోతే కూడా డయాబెటీస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.  కొన్ని గణాంకాల ప్రకారం.. మాంసం, సంతృప్త కొవ్వులు తినే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే వంట నూనె ఒక్కటే మధుమేహం వచ్చేలా చేస్తుందనడంలో ఎలాంటి నిజం లేదు. వంటనూనెతో డయాబెటీస్ వస్తుందనుకుంటే మీ ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో తెలుసుకోవడానికి డాక్టర్ ను సంప్రదించడం మంచిది. 
 

58
Diabetes

నిజానికి మనం తినే ఫుడ్ ద్వారే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా జంక్ ఫుడ్, చిప్స్, ఫ్రైస్ వంటివి ఎక్కువ తినడం వల్లే  ఈ రోజుల్లో చాలా మంది డయాబెటీస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన ఆహారం డయాబెటిస్ ప్రమాదాన్ని 70 శాతం పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే డయాబెటీస్ రాకూడదంటే ఈ ఆహారాలను అతిగా తినకండి. 

68
diabetes

డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచే ఇతర ఆహారాలు

సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం

సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది చివరికి ఒక వ్యక్తిని టైప్ 2 డయాబెటిస్ బారిన పడేస్తుంది. అలాగే సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ రెండింటిలోనూ నూనె ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది డయాబెటిస్ స్థాయిని పెంచుతుంది. ట్రాన్స్ లేదా సంతృప్త కొవ్వును నివారించడానికి ఆలివ్, కనోలా నూనెలను మీ ఆహారంలో చేర్చండి. 

78
diabetes

ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు

ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్ ఆహారం కూడా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా డయాబెటీస్ ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. తెల్ల పిండి, తెల్ల చక్కెర, తెలుపు బియ్యం  వంటి ఆహారాలు డయాబెటీస్ కు దారితీస్తాయి. అంతకాదు ఈ ఆహారాలు దీర్ఘకాలికంగా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లను నూనెతో కలపడం వల్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అందుకే డయాబెటిస్ రాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ ఈ రకమైన ప్రాసెస్ ఎక్కువగా చేసిన కార్బోహైడ్రేట్లను తీసుకోకండి. 
 

88
diabetes

రెడ్ మీట్ ను తీసుకోవడం

రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం వ్లల కూడా డయాబెటీస్ వస్తుంది. సాధారణంగా ఈ రకమైన ఆహార ఉత్పత్తులు టైప్ 2 డయాబెటిస్ కు దారితీస్తాయి. అందుకే బేకన్, హాట్ డాగ్స్, డెలి మాంసాలు వంటి ఆహార ఉత్పత్తులను  తినడం తగ్గించండి. ఎందుకంటే వాటిలో సోడియం,  నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా హానికరం. ముఖ్యంగా వీటిని నూనెలో కలిపినప్పుడు డయాబెటిస్ వచ్చే  ప్రమాదం రెట్టింపు అవుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories