ప్రయాణాలు చేయాల్సి వస్తే.. గుర్తుంచుకోవలసిన జాగ్రత్తలు
కరోనా పాజిటీవ్ అని తేలినప్పటి నుంచీ ఇంట్లోనే ఉండండి. ఇలాంటి సమయంలో ప్రయాణాలు అంత సేఫ్ కాదు. విమానాలు, బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణాలను ఉపయోగించకండి. ఎందుకంటే మీచుట్టూ ఎంతో మంది ఉంటారు. ఇతరులు మీ చుట్టూ ఉన్నప్పుడు మీరు మాస్క్ ను పెట్టుకోవడానికి ఇబ్బంది పడొచ్చు. ఇలా అని తీసేస్తే మీ నుంచి వాళ్లకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది.
ఒకవేళ తప్పనిసరి ప్రయాణించాల్సి వస్తే అధిక-నాణ్యత ఉన్న మాస్క్ లేదా రెస్పిరేటర్ ను తప్పనిసరిగా ధరించండి. ఎట్టి పరిస్థితిలో ఇతరులకు హాని కలిగించకండి.