మీ ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తినండి..

Published : Oct 17, 2022, 01:01 PM IST

ఎముకల ఆరోగ్యంపైనే మన శరీర మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవాలి. ఇందుకోసం హెల్తీ ఫుడ్స్ ను తినాలి.   

PREV
18
మీ ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తినండి..

మనం తినే ఆహారానికి.. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంది. ఎముకలు లేకండా మన శరీరం ఇలా ఉండలేదు. ఇక దంతాలు లేకుండా ఆహారం తీసుకోవడం చాలా కష్టం. అందుకే ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అయితే ఇవి బలంగా ఉండేందుకు కాల్షియం, విటమిన్ డి వంటి ఖనిజాలు ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

28

పెరుగు

పెరుగులో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. దీనిలో ఉండే పోషకాలు ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పెరుగు ప్రోటీన్ లభించే ఉత్తమ వనరులలో ఒకటి. పెరుగులో తక్కువ కొవ్వు, ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది. అలాగే పెరుగులో విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ బి12 లు కూడా పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక కప్పు పెరుగును తినడం వల్ల ఎముకలు, దంతాలు స్ట్రాంగ్ గా, ఆరోగ్యంగా ఉంటాయి. 
 

38
vitamin d

విటమిన్ డి

ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం ఒక ముఖ్యమైన పోషకం. అయినప్పటికీ.. కాల్షియాన్ని మన శరీరం శోషించుకోవాలంటే విటమిన్ డి చాలా అవసరం. అందుకే రోజూ కాసేపు ఉదయం ఎండలో నిలబడండి. అలాగే పాలు, జున్ను వంటి విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. 
 

48

పప్పు ధాన్యాలు

పప్పుధాన్యాలు కూడా ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతాయి. చిక్కుళ్లల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. 

58

విటమిన్ కె

విటమిన్ డి తో పాటుగా విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా తినాలి. ఇవి కూడా మీ ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి మీరు సోయా, జున్ను, చేపలను పుష్కలంగా తినండి. 

68

బచ్చలికూర

బచ్చలికూరలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఉండే విటమిన్ ఎ ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతాయి. 

78

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. గుడ్లు పోషకాల భాండాగారం. వీటిలో ఉండే సల్ఫర్, విటమిన్ డి, ఇతర పోషకాలు ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. 
 

 

88

బాదం పప్పులు

ఒక కప్పు బాదం పప్పులో.. 385 గ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే ఇది ఒక రోజుకు మన శరీరానికి అవసరమైన కాల్షియం మొత్తంలో మూడింట ఒక వంతు. అందుకే వీటిని తప్పకుండా తినండి. ఎముకలు, దంతాల ఆరోగ్యంగా ఉండాలంటే బాదం పప్పులను తప్పకుండా తినండి. 
 

Read more Photos on
click me!

Recommended Stories