చిన్న వయసులో గుండెపోటు ఇందుకే వస్తది..

First Published Nov 27, 2022, 3:00 PM IST

కొన్నేండ్ల కిందట గుండె జబ్బులు 40 ఏండ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 25 ఏండ్ల యువతకు కూడా వస్తున్నాయి. కారణం మన జీవనశైలేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

heart attack

ఒకప్పుడు వయసు మీద పడుతున్న కొద్దీ భయం అయ్యేది. ఎక్కడ గుండె జబ్బులు వస్తాయో అని. నిజానికి వయసు పెరిగే కొద్దీ గుండెజబ్బులతో పాటుగా ఇతర వ్యాధులొచ్చే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు.. వయసుతో సంబంధం లేకుండా ప్రమాదకరమైన రోగాలొస్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు. కొన్నేండ్ల కిందట గుండె జబ్బులు 30 ఏండ్లు దాటిన వారికే ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్త మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమంటున్నాయి సర్వేలు. 

heart attack

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గుండెపోటు, అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు 45 శాతం నాన్ కమ్యూనికబుల్ వ్యాధులతో సంబంధం ఉన్న మరణాలకు కారణమవుతున్నాయి. అలాగే 22 శాతం మంది శ్వాసకోశ వ్యాధులతో చనిపోతున్నారు. 12 శాతం మంది క్యాన్సర్ తో ప్రాణాలు విడుస్తున్నారు. 3 శాతం మంది డయాబెటీస్ తో చనిపోతున్నారట. 

heart atack

చిన్న వయసులో గుండెపోటు రాకూడదంటే.. 

80 శాతం గుండెపోటు వచ్చే అవకాశాన్ని చిన్న వయసులోనే నివారించొచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే.. స్మోకింగ్ చేయకూడదు. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. రక్తపోటు పెరగకుండా చూసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోనే ఉంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

heart attack

గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? 

గుండె జబ్బులకు ప్రధాన కారరణం కొవ్వు, కొలెస్ట్రాల్ లు, ఇతర పదార్థాలు. ఇవి ధమనుల గోడలకు అంటుకుని ఉంటాయి. దీనివల్ల గుండెకు రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. దీనిని అథెరోస్క్లెరోసిస్ అని కూడా అంటారు. ఇది చిన్న వయసులో కూడా రావొచ్చు. దీనివల్ల గుండె, శరీర కణజాలాలకు తగినంత రక్తం అందదు. దీనివల్ల గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. 
 

గుండె జబ్బుల లక్షణాలు

వైద్యుల, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండె  జబ్బుల లక్షణాలు వ్యాయామం చేసేటప్పుడు ఛాతిలో నొప్పి పుడుతుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చెమట విపరీతంగా పడుతుంది. ఆందోళన పెరుగుతుంది. 
 

click me!