జర జాగ్రత్త.. కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.. దీనినుంచి తప్పించుకోవాలంటే ఈ అలవాట్లను మానుకోండి..

Published : Jan 01, 2023, 03:57 PM IST

చైనాలో కోవిడ్ -19 విజృంభణ ఏ తీరుగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఒక్క చైనాలోనే కాదు జపాన్, యుఎస్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజు రోజుకు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఈ మహమ్మారి. ప్రాణాంతక వైరస్ నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
 జర జాగ్రత్త.. కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.. దీనినుంచి తప్పించుకోవాలంటే ఈ అలవాట్లను మానుకోండి..

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి కొత్త వేరియంట్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఈ వేరియంట్ ఎలా ఉంటుంది? దీని లక్షణాలేంటి? ప్రాణాంతకమైందా? అంటూ ప్రజల మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి ఈ వేరియంట్ ఇతర వేరియంట్ల కంటే ఇంకా వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనాను నివారించడానికి మన రోగనిరోధక శక్తిని బలంగా చేయడం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులకే కరోనా తొందరగా అంటుకుంటుంది. అందుకే మన ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలంటూ ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. అవేంటంటే..

25

శీతల పానీయాలు

శీతల పానీయాలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి మన పాణాలకు చాలా ప్రమాదకరం. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో మనం చల్లని పదార్థాలను తినకుండా ఉండటమే మేలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ శీతల పానీయాలు మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. దీనివల్ల జలుబు, దగ్గు సమస్యలు పెరుగుతాయి. అందుకే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే కూల్ డ్రింక్స్ ను తాగే అలవాటును మానుకోవాలి. 

35
smoking

స్మోకింగ్ నో చెప్పండి

స్మోకింగ్ మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా చెడ్డదన్న ముచ్చట అందరికీ తెలుసు. అయినా దీన్ని తాగే వారు చాలా మందే ఉన్నారు. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. ఊపిరితిత్తుల బలహీనత కారణంగా మీ శరీరం ఎన్నో వ్యాధులకు నిలయంగా మారుతుంది. అందుకే వీలైనంత తొందరగా స్మోకింగ్ ను మానేయండి. అలాగే కరోనా వ్యాప్తిని నివారించడానికి మీ ఊపిరితిత్తులు బలంగా ఉంచే ఆహారాలను తినండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. 
 

45

ఆల్కహాల్ కు దూరంగా ఉండండి

ఆల్కహాల్ మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని నిరూపించడలేదు. దీన్ని మోతాదులో తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ అదే పనీగా తాగితే  మాత్రం మీ ఆరోగ్యం పక్కా దెబ్బతింటుంది. ఇది మీరు కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. ఎప్పుడూ ఆల్కహాల్ ను తాగడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదు దీనివల్ల మన రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది.  మన రోగనిరోధక శక్తి తగ్గినా కోవిడ్ -19 బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుక మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, కరోనావైరస్ నుంచి దూరంగా ఉంచడానికి ఆల్కహాల్ కు దూరంగా ఉండండి.
 

55

తెల్ల పిండి పదార్థాలు

శుద్ధి చేసిన పిండితో చేసిన ఆహార పదార్థాలు నోటికి రుచికరంగా ఉంటాయి. అయినప్పటికీ శుద్ధి చేసిన పిండి పదార్థాలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ పిండి మన రోగనిరోధక శక్తిని చాలా బలహీనపరుస్తుంది. అందుకే తెల్ల పిండిని వీలైనంత తక్కువగా వాడండి. కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే తెల్ల పిండితో చేసిన ఆహారాలను మొత్తమే తినకండి. 

Read more Photos on
click me!

Recommended Stories