చలికాలంలో ఆరోగ్యం బాగుండాలంటే వీటిని తప్పకుండా తినండి..

Published : Jan 05, 2023, 12:56 PM IST

చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు రావడం చాలా కామన్. అయితే ఈ సీజన్ లో కొన్ని పోషకాహారాలను తింటే ఇలాంటి సమస్యలొచ్చే అవకాశమే ఉండదంటున్నారు నిపుణులు.   

PREV
17
చలికాలంలో ఆరోగ్యం బాగుండాలంటే వీటిని తప్పకుండా తినండి..

చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి.. ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం చాలా ముఖ్యం. ముందే ఈ సీజన్ లో దగ్గు, జలుబు, గొంతునొప్పి, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇవేవీ రాకూడదంటే ఇమ్యూనిటీని పెంచే, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, శరీరానికి అన్ని రకాల పోషకాలను అందించే ఆహారాలనే తినాలని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో పగటి టైం తక్కువగా, రాత్రి టైం ఎక్కువగా ఉన్నట్టు అందరూ గమనించే ఉంటారు. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఏ సీజన్ అయినా సరే కొన్ని అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సిందే.  కానీ చలికాలంలో మన రోగనిరోధక శక్తి బాగా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్ లోనే రోగాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను తింటే ఎలాంటి సమస్యలూ రావు. అవేంటంటే.. 

27

ఆకుకూరలు

ఆకుకూరలను  క్రూసిఫరస్ కూరగాయలను అని కూడా అంటారు. ఈ కూరగాయలను తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. బ్రోకలీ, కాలీఫ్లవర్ కూరగాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగననిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే ఈ సీజన్ లో దొరికే ఆకు కూరలను మిస్ కాకుండా తినండి. 
 

37

చేపలు

సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిలో విటమిన్ డి కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో  ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల కోసం కాల్షియం గ్రహించే శారీరక సామర్థ్యం పెరుగుతుంది. చేపలు శారీరక ఆరోగ్యాన్నే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. చేపల్లో ఎక్కువ మొత్తంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. 
 

 

47

పెరుగు

పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. పెరుగు మన గట్ బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. అలాగే ఇది గొప్ప ప్రోబయోటిక్. పెరుగులో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పెరుగును చక్కెరకు బదులుగా తాజా పండ్లు, గింజలతో కలిపి తింటే మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 

57

బెల్లం

బెల్లాన్ని ఈ కాలంలోనే తినాలి? ఆ కాలాల్లో తినొద్దని లేదు. ఎందుకంటే దీన్ని ఏడాది పొడవునా తినొచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. అలాగే మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలికాలంలో బెల్లాన్ని తింటే  మీ శరీరం వెచ్చగా ఉంటుంంది. అలాగే పేగు పనితీరును మెరుగుపర్చడంతో పాలుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంంది. అయినప్పటికీ.. బెల్లాన్ని కూడా మోతాదులోనే తినాల్సి ఉంటుంది. చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెల్లాన్ని లడ్డూలు చేసుకుని తినండి. 
 

67
spices

మసాలా దినుసులు

కొన్ని మసాలా దినుసులు కూడా మన శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంగువ, ఆవాలు, ధనియాలు, నల్ల మిరియాలు, మెంతులు, వాము వంటివి మసాలా దినుసులు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చలికాలంలో దగ్గు, ఫ్లూ లను తగ్గించుకోవడానికి ఆవాలు, వాము సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ మసాలా దినుసులు ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. మెంతులు ఈ నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్  రోగనిరోధక శక్తిని కలిగి ఉంటుంది. 

77
ghee

నెయ్యి

ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉండే పదార్థాల్లో నెయ్యి ఒకటి.  ఇది ఆహారాలను రుచిగా చేయడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. నెయ్యి విటమిన్లకు మంచి వనరు. ఇది మన జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. చర్మ సమస్యలను పోగొట్టి.. అందంగా మెరిసేలా చేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories