Benifits of having Beard: ‘గడ్డం’తో హెల్త్ బెనిఫిట్స్..

Published : Feb 15, 2022, 11:51 AM ISTUpdated : Feb 15, 2022, 11:53 AM IST

Benifits of having Beard: ప్రస్తుత కాలంలో గడ్డం పెంచుకోవడం ప్రతి ఒక్కళ్లకి ఫ్యాషన్ గా మారింది. ముఖ్యంగా యూత్ నిండుగా గడ్డాన్నిపెంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. ఈ గడ్డం ఫ్యాషన్ సింబల్ గానే కాకుండా.. దీనితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. అవేంటంటే..

PREV
16
Benifits of having Beard: ‘గడ్డం’తో హెల్త్ బెనిఫిట్స్..

Benifits of having Beard: ఒకప్పుడు యూత్ నుంచి మొదలు పెడితే.. ముసలి వాళ్ళ వరకూ గడ్డాన్ని నీట్ గా షేవింగ్ చేసుకునే వారు. కొందరు కేవలం మీసాలనే ఉంచుకుంటే.. మరికొందరు అవి కూడా తీసేసే వారు. ఇప్పుడు రోజులు మారినయ్.. యూతే కాదు మధ్యవయస్కులు కూడా నిండుగా గడ్డాన్ని పెంచడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

26

అయితే కొంత మంది ఈ గడ్డాలను చూసి.. వామ్మో అచ్చం దొంగలా ఉన్నాడంటే అంటే, మరికొందరు బూచోడిలా మస్తునున్నావ్ అంటూ వెక్కిరిస్తుంటారు. నీకు క్లీన్ షేవ్ యే సూపర్ గా ఉంటుంది. అందులోనే నువ్ స్మార్ట్ గా ఉంటావంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని చెప్పినా గడ్డాన్ని మాత్రం అస్సలు తీసేయరు. 
 

36

కొందరు గడ్డాన్ని ఇష్టపడితే.. మరికొంతమంది ఈ గడ్డాన్ని చికాకుగా ఫీలవుతుంటారు. అందుకే గడ్డం కొంచెం పెరిగినా.. వెంటనే తొలగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఫ్యాషన్ గా మారిన గడ్డం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని England సండర్ ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన లెక్చరర్, సర్జికల్ డాక్టర్ కరుణ్ రంగార్జన్ అంటున్నారు. ఈ గడ్డం వల్ల కలిగే ఉపయోగాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 
 

46

డాక్టర్ కరుణ్ తెలిపిన విషయాల ప్రకారం.. క్లీన్ షేవ్ చేసుకోవడం కంటే కొద్దిగా గడ్డంతో ఉండటమే బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే ముఖం సన్నగా ఉన్నావారు కాస్త గడ్డాన్ని పెంచుకోవడం వల్ల వారి ఫేస్ కొంచెం లావుగా కనిపిస్తుంది. ముఖ్యంగా గడ్డం ఉన్నవారితో పోల్చితే గడ్డం లేనివారి ముఖం మీదే  Methicillin resistant Staphylococcus aureus (MRSA) అనే బ్యాక్టీరియా మూడింతలు అధిక మొత్తంలో ఉంటుందని హెచ్చిరిస్తున్నారు. 
 

56

ఈ బ్యాక్టీరియా ఎన్నో రకాల Antibiotics ను ఎదురించే నిరోధక శక్తిని కలిగి ఉంటుందని డాక్టర్ చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం పొంచి ఉందట. ముఖ్యంగా క్లీన్ షేవ్ చేసుకునేటప్పుడు Skin abrasion అవుతుంది. దాంతో అక్కడ చిన్న చిన్న పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. అక్కడే MRSA అనే బ్యాక్టీరియా  Growth అవుతుందని ఆయన తెలుపుతున్నారు. కాబట్టి బ్యాక్టీరియాను అడ్డుకోవాలంటే క్లీన్ షేవ్ చేసుకోకూడదని ఆయన చెబుతున్నారు. కొంచెం గడ్డం పెంచినా ఈ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండదట.

66

గడ్డం పెంచుకోవడం వల్ల సూర్యుని నుంచి వచ్చే ప్రమాదరకమైన అతినీల లోహిత కిరణాల నుంచి స్కిన్ ను రక్షించుకోవచ్చట. దీనివల్ల స్కిన్ క్యాన్సర్ వంటి అనేక రోగాలు వచ్చే అవకాశమే ఉండదట. గడ్డంతో ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిసింది కదా.. ఇప్పటినుంచి మీకు నచ్చిన స్టైల్లో గడ్డాన్ని పెంచి ఆరోగ్యంగా, ఫ్యాషన్ గా ఉండండి.. 


 

Read more Photos on
click me!

Recommended Stories