జీవిత భాగస్వామిని చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటున్నారా? జాగ్రత్త అదెంతో ప్రమాదకరం..

First Published | Feb 15, 2022, 11:03 AM IST

కొంతమంది భార్యా భర్తలు తమ భాగస్వామిని వారి చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి సూటి పోటి మాటలు మాట్లాడుతుంటారు. నేను చెప్పినట్టు నడుచోవాలంటూ వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. సూటి పోటి మాటలతో వారిని మానసికంగా హింసిస్తే తర్వాత జరిగే పరిణామాలను మీరు అస్సలు ఊహించుకోలేరు.

ఆలుమగలన్నాకా సవాలక్ష వ్యవహారాలుంటాయి. ప్రేమ, కోపం, చిన్న చిన్న కొట్లాటలు, జగడం జరగడం వంటివి చాలా కామన్. ఇలాంటివి ఎన్ని ఎదురైనా వాటన్నింటిని భార్యా భర్తలిద్దరూ కలిసి పరిష్కరించుకున్నప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. లేదనుకో..  వైవాహిక జీవితం మూనాళ్ల ముచ్చటగానే ఉంటుంది. 
 

కొందరు భాగస్వాములు ఎన్ని కష్టాలెదురైనా వాటన్నింటిని కలిసి ఎదుర్కొంటారు. కలిసి పరిష్కరించుకుని వారి బంధాన్ని పదికాలాల పాటు పదిలంగా కాపాడుకుంటారు. వారి అన్యోన్యతే వారిని బలంగా ఉంచుతుంది. అలాంటి వారే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తారు. భార్యా భర్తల మధ్యన అండర్ స్టాండింగ్ ఎంతో ముఖ్యం. ఇది లేకపోతేనే వారి మధ్య సక్యత లోపిస్తుంది.


కొన్ని జంటు చిన్న చిన్న గొడవలను అస్సలు కేర్ చేయరు. కానీ కొన్నిజంటలు మాత్రం వీటిని పట్టుకొని వాలేడుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్నిజంటల్లో గొడవలు ఒకరి వల్లే వస్తాయి. మరొకొన్ని జంటల్లో ఇద్దరూ కొట్లాటలకు కాలు దువ్వుతుంటారు. కానీ కొంతమంది భాగస్వాముల మధ్య ఎటువంటి గొడవలూ, కొట్లాటలూ జరగవు. అలాగని వారి మధ్య అంతులేని ప్రేమ కూడా ఉండదు. ఎందుకంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ జీవిత భాగస్వామిని చెప్పుచేతల్లో పెట్టుకోవాలని నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. అంతేకాదు వారిని సూటి పోటి మాటలతో మానసికంగా హింసిస్తుంటారు.
 

ఇలా చేయడం చాలా ప్రమాదరకం. ఎందుకంటే ఇలా మాట్లాడటం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల బాధిత భార్య లేదా భర్త మానసికంగా గాయపడే ప్రమాదముంది. అంతేకాదు వారు రోజు రోజుకు క్రుంగిపోతారు. అందుకే భార్యా భర్తల్లో ఇలా ఎవరు మాట్లాడుతారో వారిని ముందే గుర్తించడం చాలా అవసరం. అవసరమైతే వారికి నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించడం కూడా చేయాలి. అలా చేసినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే.. నీతో కలిసి ఉండలేనని తేల్చి చెప్పేయడం బెటర్. ఇలా చెప్పడం వల్ల వారు మీతో కలిసి బతకడానికి వారి వైఖరిని మార్చుకునే అవకాశం ఉంది. లేదంటే మీతో విడాకులు తీసుకోవాలనుకుంటారు. పరిస్థితి అందాక వస్తే వారితో విడిపోవడమే బెటర్. ఎందుకంటే మానసికంగా సింహించేవారితో కలకాలం బతకడమన్నది పూర్తిగా మన బ్రమే అవుతుంది. మరి మీ  పట్ల మీ భాగస్వామి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..

నన్ను చేసుకోవడం నీ లక్: కొంత మంది భార్యా భర్తలు నన్ను చేసుకోవడం వల్లే నీ లైఫ్ ఇంత హ్యాపీగా ఉందంటూ మాటి మాటికీ ఎవరో ఒకరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మరికొందరేమో.. నా కంటే మంచి వ్యక్తి నీకు అస్సలు దొరకనేపోవు అంటూ వెక్కిరిస్తూ మాట్లాడుతూ ఉంటే.. మరికొంతమందేమో.. వాయబ్బో నువ్వెంత మంచి వ్యక్తివి.. ఇంత మంచి ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదని వ్యగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడేవారి ప్రవర్తన ప్రమాదరకమే. వీరిని మానసికంగా సెట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మీ పట్ల ప్రేమున్నవారు, మిమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకునే వారు మాట్లాడితే వారిని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. 
 

Breakup

నలుగురిలో విమర్శించడం: ఆలుమగల మధ్యన ఎన్ని గొడవులు, కొట్లాటలు జరిగినా.. అవి వాళ్ల ఇంటివరకే ఉంటాయి. వాటిని అస్సలు బయటేసుకోరు. నలుగురికి వారి మధ్యనున్న కొట్లాటలు చెప్పి వారి భాగస్వామిని విమర్శించరు. కానీ వారి పార్టనర్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు  మాత్రం వారి భార్య లేదా భర్తను నలుగురిలో విమర్శిస్తారు. బయటకు వెళ్లినప్పుడు ఎంత మంది ఉన్నారో అని చూసుకోకుండా వారి గౌరవాన్ని భంగ పరుస్తారు. నలుగురు ఉన్నారు.. ఈ మాటలు అనాలా వాద్దా అని ఆలోచించకుండా చెడా మడా తిట్టేస్తుంటారు. 

పక్కవారితో పోల్చడం:  కొంత మంది భార్యా భర్తల్లో ఎవరో ఒకరు ప్రతి చిన్న విషయానికి కూడా బయటి వ్యక్తులతో పోలుస్తుంటారు. వాళ్లు చూడు ఎంత సంపాదిస్తున్నారు.. నువ్వూ ఉన్నావ్ ఏదీ చేతకాని దద్దమ్మకు, వాళ్లను చూసి నేర్చుకో ఇంటి సంసారం ఎంత చక్కగా సరిదిద్దుతున్నారో అంటూ తరచుగా అవమానిస్తూ ఉంటారు. పక్కింటి వాళ్లను చూసి నేర్చుకో ఎంత బాగా వంటచేస్తారో.. నువ్వు చేస్తావ్ పెంట వంట అంటూ ఎత్తిపొడుపు మాటలు ఉంటూ ఉంటారు. తరచుగా ఇలా మాట్లాడటం వల్ల మీ భాగస్వామి మానసికంగా క్రుంగిపోయి , మానసిక రోగులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి మాటల వల్లే మీ భాగస్వామికి మీరంటే ప్రేమ పోయి ద్వేషం వస్తుంది. ఇలాంటి మాటలకు దూరంగా ఉండటమే బెటర్.  అప్పుడే వారి బందం నిలుస్తుంది. లేదంటే విడిపోయే ప్రమాదముంది. 
 
 

Latest Videos

click me!